Site icon Prime9

Hiroshima Nagasaki Day: హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడికి 80 ఏళ్లు.. ట్రంప్ రావాలని ఆహ్వానం

Hiroshima Bombing Date Hiroshima Nagasaki Attack Completes 80 years: హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడి ఘటన చోటుచేసుకొని 80 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో పలు కార్యక్రమాలను జపాన్ నిర్వహిస్తుండగా.. ఈ ప్రోగ్రాంలకు హాజరుకావాలని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను జపాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇందులో భాగంగానే ఆ రెండు నగరాల మేయర్లు డొనాల్డ్ ట్రంప్ రావాలని సంయుక్తంగా లేఖలు రాసింది.

కాగా, అణుబాంబు బాధితుల బాధలను డొనాల్డ్ ట్రంప్ తెలుసుకోవడంతో పాటు శాంతి కోసం ఆ నగర ప్రజలు పడుతున్న ఆరాటాన్ని అర్థం చేసుకోవాలని మేయర్లు అన్నారు. ప్రధానంగా బాధితుల అనుభవాలు, అణ్వాయుధాల అమానవీయతపై అవగాహన పెంచుకోవాలన్నారు. అలాగే అణ్వాయుధాల నిషేధించాలని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, అమెరికా దేశం 1945 ఆగస్టు 6, 9వ తేదీలలో హిరోసిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులతో దాడి చేసింది. ఈ ఘటన తర్వాత జపాన్ దేశం సెకండ్ వరల్డ్ వార్‌లో లొంగిపోయింది. హిరోషిమాలో దాదాపు లక్ష40వేల మంది మృతి చెందగా.. నాగసాకిలో 74వేల మంది చనిపోయారు. ఈ దాడిలో గాయపడిన కొంతమంది రేడియేషన్ ప్రభావంతో మృతి చెందారు.

అయితే, ఈ అణుబాంబు దాడి జరిగిన నాటి నుంచి నేటి వరకు అమెరికా క్షమాపణలు చెప్పలేదు. కాగా, 2010లో తొలిసారి అమెరికా రాయబారి జాన్ రూస్ హిరోషిమాలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత 2016 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హిరోషిమాను సందర్శించారు. దీంతో హిరోషిమాను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా నిలిచారు. ఇటీవల 2023లో జో బైడెన్ పర్యటించగా.. ట్రంప్ మాత్రం ఈ పగనాలరే వెళ్లలేదు.

Exit mobile version