Site icon Prime9

Hamas chief Yahya Sinwar: హమాస్‌ కొత్త చీఫ్‌ యాహ్యా సిన్వార్‌ హతం? తేల్చి చెప్పిన ఇజ్రాయెల్ ఆర్మీ!

Israel offers update Hamas chief Yahya Sinwar dead: హమాస్‌తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ మరోసారి విజయం సాధించింది. హమాస్‌పై చేసిన దాడిలో ఆ దేశ కొత్త చీఫ్ యాహ్య సిన్వార్‌ హతమైనట్లు తెలుస్తోంది. తాజాగా, హమాస్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో యాహ్య సిన్వర్‌ను హతమార్చినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

గాజాలోని స్ట్రిప్ అనే ప్రాంతంపై గురువారం ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులను ఆ దేశ మిలిటరీ హతమార్చింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, మృతి చెందిన వారిలో యాహ్య సిన్వార్ కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై నిర్దారణ రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే నిర్ధారణ కోసం డీఎన్ఏ పరీక్షలు చేసి ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం.

మరోవైపు, గాజా దాడిలో యాహ్య సిన్వర్ మృతదేహం కూడా లభ్యం అయినట్లు పలు మీడియా కథనాల్లో వెల్లువడ్డాయి. ఓ సాధారణ మిలటరీ కాల్పుల్లో చనిపోయినట్లు సమాచారం. భారతీయ కాలమాన ప్రకారం.. మధ్యాహ్నం 2.30 గంటల సమలో ోయినట్లు వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై తొలిసారి జరిగిన దాడిలో సిన్వార్ మాస్టర్ ప్లాన్ వేసిన సంగతి తెలిసిందే. హమాస్ మిలిటెంట్లు చేసిన ఈ దాడిలో దాదాపు 1200 మంది దుర్మరణం చెందారు. కొంతమందిని బందీలుగా ఉంచింది. ఇందులో ప్రధానంగా సిన్వార్ సూత్రధారి అని ఇజ్రాయెల్ ప్రకటించింది.

అయితే అప్పటినుంచి ఇజ్రాయెల్ రగిలిపోతుంది. సిన్వార్‌ను హతమార్చేందుకు స్కెచ్ వేసింది. దాడి చేసిన ప్రతీసారి సిన్వార్ తప్పించుకుంటున్నాడు. ఈ తరుణంలోనే ఏకధాటిగా ఇజ్రాయెల్ దాడి చేస్తూ వస్తోంది. ఇటీవల చేసిన దాడిలో మరో సూత్రదారి డెయిప్‌ను హతమార్చింది. ఆ దాడిలో సిన్వార్ మళ్లీ తప్పించుకున్నాడు. ఈ మేరకు డెయిప్ మరణించినట్లు ఇజ్రాచెల్ సైన్యం తెలిపింది.

కానీ సిన్వార్ మాత్రం తప్పించుకొని తిరిగినట్లు ఇజ్రాయెల్ గుర్తించింది. ఎన్ని దాడులు చేసినా బయటపడుతున్నాడు. తాజాగా, గాజాపై చేసిన దాడుల్లో హతమైనట్లు సమాచారం. అయితే అంతకుముందు హమాస్ అధ్యక్షుడు ఇష్మాయెల్ హనియో హతమైన తర్వాత సిన్వార్‌ను హమాస్ చీఫ్‌గా నియమించారు.

Exit mobile version