Site icon Prime9

Trump Cabinet: ట్రంప్ క్యాబినెట్‌లో నలుగురు భారతీయులు.. ఎవరో తెలుసా?

Indians In Trump Cabinet: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్‌లో ఇండియన్స్‌కి ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ రేసులో ప్రస్తుతం నలుగురు ఉన్నారు. అయితే కమలా హారిస్‌తో పోటీ పడిన ట్రంప్, ఆమెను ఎదుర్కొనేందుకు తనవైపు కూడా ఇండియన్స్ ఉన్నారనే ప్రచారాన్ని కల్పించారు. ఒకవేళ అనుకున్నట్లు ఇండియన్స్‌కి చోటు దక్కితే, ఇండో అమెరికన్ బంధం మరింత బలపడుతుందని అంటున్నారు.

వివేక్ రామస్వామి 
బయోటెక్ పారిశ్రామిక వేత్త అయిన వివేక్ రామస్వామికి ట్రంప్ క్యాబినేట్ లో తప్పక చోటు దక్కుతుందని అంటున్నారు. పెన్సిల్వేనియాలోని ఒక పబ్లిక్ మీటింగులో ట్రంప్ మాట్లాడుతూ విజయం సాధించిన తర్వాత తన కార్యవర్గంలోనికి తీసుకుంటానని మాట ఇచ్చారు. అదే ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి వివేక్ రామస్వామి ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. 2024లో ట్రంప్ కి ఆయన పోటీదారుగా నిలిచారు. కానీ మనసు మార్చుకుని ఆయన గెలుపునకు తీవ్రంగా శ్రమించారు. ఈ కారణంగానే ట్రంప్ కూడా మాటిచ్చారని అంటున్నారు. ఈయన శుద్ధ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. కేరళకు చెందిన తమిళం మాట్లాడే బ్రాహ్మణులు. కేరళలోని పాలక్కాడ్ నుంచి అమెరికాకు ఈయన కుటుంబం వలస వచ్చింది.

కశ్యప్ ప్రమోద్ పటేల్
డొనాల్డ్ ట్రంప్ నకు అత్యంత విశ్వాసపాత్రునిగా భారతీయ మూలాలున్న కశ్యప్ పటేల్ ఉన్నారు. తనని కాష్ పటేల్ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇతని తల్లిదండ్రులు గుజరాత్ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. అయితే అంతకుముందు వీరి కుటుంబం ఉగండాలో ఉన్నప్పుడు అక్కడ నియంత బెదిరింపుల కారణంగా… అమెరికాకి వలస వచ్చారు. న్యూయార్క్ లోని గార్డెన్ సిటీలో కశ్యప్ జన్మించాడు. ‘లా’ చదువుకుని మియామి కోర్టులో పబ్లిక్ డిఫెండర్ గా పనిచేశారు. ఇక అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో అత్యంత రహస్య నిఘా సంస్థ సీఐఏకు అధిపతిగా ఉన్నారు. రక్షణ విషయంలో తనకి అండదండగా కశ్యప్ ఉంటాడని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే తనకి కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.

లూసియానా మాజీ గవర్నర్ బాబీ జిందాల్
ఇక ట్రంప్ కార్యవర్గంలోకి వస్తారని భావిస్తున్న వారిలో ఇండియాకి చెందిన లూసియానా మాజీ గవర్నర్ బాబీ జిందాల్ పేరు వినిపిస్తోంది. హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీగా అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ ఎ హెల్తీ అమెరికాకు అధిపతిగా ఉన్నారు. గతంలో గవర్నర్ గా కూడా పనిచేశారు. వీరి కుటుంబం కూడా మొదట పంజాబ్ నుంచి అమెరికా వచ్చి లూసియానాలో స్థిరపడ్డారు.

నిమ్రత నిక్కీ హేలీ..
సౌత్ కరోలినా గవర్నర్ గా పనిచేసిన నిమ్రత నిక్కీ హేలికి కూడా ట్రంప్ కార్యవర్గంలో చోటు దక్కేలా కనిపిస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి తను ట్రంప్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అయితే ముందస్తు ఒప్పందాల్లో భాగంగా ఆమెను ఒప్పించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆమె ట్రంప్ కి మద్దతుగా ప్రచారం చేశారు. అందుకే తనకి కూడా కార్యవర్గంలో చోటు దక్కుతుందని అంటున్నారు. పంజాబ్ లోని అమృత్‌సర్ నుంచి వీరి కుటుంబం మొదట కెనాడ వచ్చి, అక్కడ నుంచి అమెరికా వచ్చి సౌత్ కరోలినాలో స్థిరపడ్డారు.

Exit mobile version