Food Crisis in Pakistan: పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ గ్లోబల్ స్టేజీపై ఇండియాతో సమానంగా పాకిస్తాన్ పోటీ పడుతోందని గొప్పలు చెబుతుంటారు. తీరా చూస్తే యునైటెడ్ నేషన్స్ పాకిస్తాన్ ముసుగు తొలగించింది. వాస్తవాలు యావత్ ప్రపంచానికి తెలియజేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటోందని.. ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారని తాజా నివేదికలో వెల్లడించింది.
సుమారు1.1 కోట్ల మంది ప్రజలు ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం ఉందన్న చేదు వాస్తవాలు వెల్లడించింది. అదే ఇండియా విషయానికి వస్తే సంక్షోభం సమయంలో ప్రపంచదేశాలకు ఆహారం ఎగుమతి చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం తమ పౌరులకు రెండు పూటల ఫుడ్ పెట్టడానికి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ప్రత్యేక కధనంలో యునైటెడ్ నేషన్స్ రిపోర్టు వివరాలు తెలుసుకుందాం.