Site icon Prime9

UAE : యూఏఈలో భారత మహిళలకు మరణశిక్ష అమలు

UAE

UAE

UAE : యూఏఈలో భారత మహిళ షెహజాది ఖాన్‌కు మరణశిక్ష అమలు అయ్యింది. తన సంరక్షణలో ఉన్న చిన్నారి మృతి కేసులో హత్య అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో యూపీలోని బాందా జిల్లాకు చెందిన ఆమెకు యూఏఈ సర్కారు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తెను రక్షించాలంటూ కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు ఆమె ప్రాణాలు విడిచింది. ఫిబ్రవరి 15న శిక్ష అమలు అయ్యింది. ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు విదేశాంగ శాఖ తెలియజేసింది.

కేసు నేపథ్యం..
యూపీలోని బాందా జిల్లా గోయ్రా ముగ్లి గ్రామానికి చెందిన షెహజాది ఖాన్ 2020 సంవత్సరంలో కిచెన్‌లో పనిచేస్తుండగా అగ్నిప్రమాదానికి గురైంది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంది. 2021లో ఉజైర్ అనే వ్యక్తి ఆమెను యూఏఈలోని అబుదాబీకి తీసుకెళ్తానని, అక్కడే జీవితం బాగుంటుందని ఆశ చూపాడు. మాటలు నమ్మి అతడితో వెళ్లింది. ఉజైర్ ఆమెను ఆగ్రాలోని తమ బంధువులు ఫైజ్, నాడియా దంపతులకు విక్రయించాడు. దంపతులు ఆమెను అబుదాబీకి తీసుకెళ్లారు. చివరికి ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. న్యాయస్థానం ఆదేశాలతో ఫైజ్, నాడియా దంపతులపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేశారు.

మరోవైపు ఫైజ్, నాడియా దంపతుల బిడ్డ బాగోగులు షెహజాది ఖాన్ చూస్తోంది. అనుకోకుండా ఆ బిడ్డ మృతిచెందింది. దంపతులిద్దరూ షెహజాదిపై హత్య ఆరోపణలు మోపారు. అక్కడి దర్యాప్తు బృందాలు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చాయి. షెహజాది మాత్రం ఔషధాల విషయంలో దంపతులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే చిన్నారి ప్రాణాలు పోయినట్లు చెబుతోంది. కానీ, న్యాయస్థానం మాత్రం ఆమెకు మరణశిక్షను విధించింది. షెహజాది తండ్రి షబ్బీర్ ఖాన్ తన కుమార్తెను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.

తాజాగా ఫిబ్రవరి 16న అక్కడి జైలు అధికారులు షెహజాది చివరి కోరిక ఏమిటని అడిగారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పింది. దీంతో ఆమె కుటుంబ మాట్లాడించారు. ఈ సందర్భంగా తాను నిర్దోషినని ఆమె కుటుంబం వద్ద కన్నీరు పెట్టుకుంది. తాజాగా ఆమెకు మరణశిక్ష అమలు అయ్యింది.

Exit mobile version
Skip to toolbar