Site icon Prime9

German strike : జర్మనీ విమానాశ్రయాల్లో సమ్మె.. 3400 విమానాలు రద్దు

German strike

German strike

German strike : జర్మనీలోని ఎయిర్‌పోర్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఫ్రాంక్‌ఫర్ట్‌, మ్యూనిక్‌‌పాటు ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాల్లో ఫ్లెట్ సర్వీసులపై ప్రభావం పడింది. వేలాది ఫ్లెట్ సర్వీసులు రద్దు కాగా, 5 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది.

5 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం..
ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయం నుంచి 1116 ఫ్లెట్‌లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో 1054 సర్వీసులు రద్దు అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బెర్లిన్‌ నుంచి నడిచే విమానాలు కూడా రద్దు కాగా, హాంబర్గ్‌లో అన్ని విమానాలు కూడా రద్దు అయ్యాయి. ఫ్లెట్ సర్వీసులు రద్దు అయినట్లు కొలోన్‌ విమానాశ్రయం ప్రకటించగా, సమ్మె కారణంగా విమాన సర్వీసుల సంఖ్య భారీగా తగ్గినట్లు మ్యూనిక్‌ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు తెలిపారు. 3400 ఫ్లెట్ సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని జర్మనీ మిమానాశ్రయం ఆపరేటర్ల అసోసియేషన్‌ అంచనా వేసింది. 5 లక్షల మంది ప్రయాణికులపై ఇది ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది.

బోనస్‌ ఇవ్వాలని డిమాండ్..
వేతనాలు పెంచాలని సర్కారు ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. పనిప్రదేశంలో షరతులు సహా అదనపు సమయానికి ఎక్కువ మొత్తంలో బోనస్‌ ఇవ్వాలని కోరుతూ విమానాశ్రయాల్లో పనిచేసే సిబ్బంది, కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. వారి డిమాండ్లను పరిష్కరించలేమని ఆయా యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఉద్యోగ, కార్మిక సంఘాలు ఒకరోజు సమ్మెకు దిగాయి. ఈ నెల చివర్లలో మరోసారి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version
Skip to toolbar