Prime9

Greece Earthquake: గ్రీస్ ను వణికించిన భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!

Breaking – Earthquake in Greece: యూరోపియన్ దేశం గ్రీస్ ను భారీ భూకంపం వణికించింది. తీరప్రాంతంలో వచ్చిన ప్రకంపనలతో గ్రీస్ మొత్తం వణికిపోయింది. ఇవాళ ఉదయం వచ్చిన భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గ్రీస్ పొరుగు దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి.

 

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైనట్టు జర్మనీలోని రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ ప్రకటించింది. గ్రీస్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం యూలొండాకు 58 కిలోమీటర్ల దూరంలో భూమి లోపల 77 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. అయిదే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. సుమారు 100 కి.మీ. లోపు సునామీ వచ్చే అవకాశం ఉందని, తీవ్రత ఎక్కువ ఉంటే ఆ పరిధి మరింత పెరగొచ్చని యూరోపియన్- మధ్యధరా ప్రాంత భూకంప కేంద్రం తెలిపింది.

 

కాగా కొంతకాలంగా గ్రీస్ ను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. వారం క్రితం దక్షిణ తీరంలో భారీ భూకంపం వచ్చింది. 6.1 తీవ్రతతో వచ్చిన భూకంపంతో పొరుగు దేశాలైన టర్కీ, ఈజిప్టు, లెబనాన్, ఇజ్రాయెల్ దేశాలపై కూడా ప్రభావం పడింది. అప్పుడు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కానీ అదృష్టవశాత్తు ఎలాంటి అపాయం కలగలేదు.

Exit mobile version
Skip to toolbar