Site icon Prime9

Democrats: ట్రంప్‌ రాకకు ముందే నిర్ణయం.. న్యాయమూర్తులను నియమిస్తున్న డెమోక్రట్లు..!

Democrats push to confirm Biden’s federal judge nominees: అగ్రరాజ్యం ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోని సెనెట్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డెమోక్రట్లు ఫెడరల్‌ న్యాయమూర్తుల నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్‌ బాధ్యతలు
వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్‌ అమెరికా డిస్ట్రిక్‌ కోర్టు జడ్జిగా పెర్రీని నియమించారు. సెనెట్‌ ఆమోదం కోసం మరో 31 మంది ఎదురుచూస్తున్నారు. అధ్యక్షుడు నామినేట్ చేసిన న్యాయమూర్తులకు సెనెట్ నుంచి ఆమోదం లభిస్తే.. ఆ పదవి నుంచి వారిని తొలగించడం వీలుకాదు. అమెరికా రాజ్యాంగం సెనెట్‌కు అధికారం కల్పించింది. డెమోక్రట్లు తమ పదవిని వీడేలోగా ఫెడరల్ న్యాయమూర్తుల నియామకాలు చేపడుతున్నారు.

213 మంది జ్యూడిషియల్‌ నామినీల నియామకం
ట్రంప్‌ అధికారంలో ఉన్న సమయంలో 234 నియామకాలు చేశారు. జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కేతంజీ బ్రౌన్‌ జాక్సన్‌తోపాటు 213 మంది జ్యూడిషియల్‌ నామినీలను నియమించినట్లు సెనెట్ ధ్రువీకరించింది. మూడింట రెండో వంతు మహిళా న్యాయమూర్తులు ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే మిగిలిన నామినీల నియామకాలను సైతం వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

తప్పుబట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌, మద్దతుదారులు
బైడెన్‌ నామినీలను నియమించడాన్ని ట్రంప్‌, ఆయన మద్దతుదారులు ఎలాన్‌ మస్క్‌ తప్పుబట్టారు. దాన్ని వెంటనే నిలిపివేయాలని సెనెట్‌కు పిలుపునిచ్చారు. తాము నియమించుకున్న న్యాయమూర్తులతో డెమోక్రట్లు ముందుకుసాగాలని చూస్తున్నారని ట్రంప్‌ విమర్శించారు.

Exit mobile version