Site icon Prime9

Darya Dugina: పుతిన్‌ సన్నిహితుడి కుమార్తె హత్య

Moscow: పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన అలెగ్జాండర్‌ డుగిన కుమార్తెను కారు బాంబు పేల్చి మాస్కోలో హత్య చేశారు. పుతిన్‌ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తిగా అలెగ్జాండర్‌కు పేరుంది. వాస్తవానికి అలెగ్జాండర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయగా, అతడి కుమార్తె డార్యా డుగిన మరణించినట్లు రష్యా మీడియా కథనాలు వెలువరించింది. డార్యా తన కారులో ఇంటికి బయల్దేరగా, మొజస్కౌయి హైవేపై బోల్షియా వద్దకు రాగానే కారులో భారీ పేలుడు చోటు చేసుకుంది. దాడిలో ధ్వంసమైన కారు తండ్రి అలెగ్జాండర్‌ది. ఆయనే అసలైన లక్ష్యమని రష్యా అధికారులు అనుమానిస్తున్నారు.

ఉక్రెయిన్‌ పై రష్యా దాడికి అలెగ్జాండర్‌ వాదన కూడా కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఈ యుద్ధం విషయంలో పుతిన్‌ను అలెగ్జాండర్‌ బాగా ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. అలెగ్జాండర్‌ కుమార్తె డార్యా కూడా రచయిత. ఆమె పూర్తిగా సంప్రదాయవాది. ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన అమెరికా ట్రెజరీస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ ఫారెన్‌ అసెట్స్‌ ఆంక్షల జాబితాలో డార్యా కూడా ఉన్నారు. ఆమె ఉక్రెయిన్‌ పై రాసిన వ్యాసం కారణంగా ఈ జాబితాలో చేర్చారు.

Exit mobile version