China Debt Trap: China offers Debt trap diplomacy : దశాబ్దం క్రితం చైనా గ్లోబల్ స్టేజిఎక్కి పేద దేశాలను ఉద్దరిస్తానంటూ ప్రగల్బాలు పలికింది. మీ దేశాల్లో రోడ్డు నిర్మించి ఇస్తాం. రైల్వే లైన్లు వేసి ఇస్తాం.. బ్రిడ్జిలు కట్టిస్తాం .. పవర్ ప్లాంట్‌లు పెట్టిస్తాం కావాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటూ ఆకర్షించింది. తీరా దశాబ్దం తిరిగి సరికి మాట మార్చి తాము పెట్టుబడిగా ఇచ్చిన డబ్బు కక్కండి అంటూ పేద దేశాల మెడపై కత్తి పెట్టింది.
ఈ ఏడాది చైనాకు 75 అత్యంత పేద దేశాలు సుమారు 22 బిలియన్ డాలర్లు చెల్లించాలి. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు రెండు లక్షల కోట్లు చెల్లించుకోవాల్సి వస్తోంది. ఒక విధంగా చైనా పేద దేశాలను అప్పుల ఊబిలో దించిందని చెప్పుకోవాల్సిందే. ఇక చైనా వసూలు చేసే వడ్డీ కూడా మామాలుగా ఉండదు. వాణిజ్య బ్యాంకుల రేటు కంటే కాస్తా ఎక్కువగా వసూలు చేస్తోంది.
ప్రస్తుతం చైనా నుంచి డబ్బు తీసుకున్న దేశాలు దిక్కుతోచక సతమతమవుతున్నాయి. లేదంటే దేశంలో కొంత భాగం చైనా విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్లోబల్ స్టేజీలో చైనా ప్రస్తుతం కాబూలీవాల్ పాత్ర పోషిస్తోంది. అప్పులు ఇచ్చి బలవంతంగా వసూలు చేసుకుంటోంది. ప్రత్యేక కథనంలో చైనా కాబూలీవాల పాత్ర గురించి తెలుసుకుందాం.