Brazil Plane Crash: బ్రెజిల్‌లో ఘోర విషాదం.. విమానం కుప్పకూలడంతో 10 మంది పర్యాటకులు దుర్మరణం

Brazil Plane Piloted By Top Businessman Crashes In Tourist City atleast 10 Killed: బ్రెజిల్‌లో ఘోర విషాదం.చోటుచేసుకుంది. బ్రెజిల్‌లోని టూరిస్ట్ సిటీ గ్రామాడోలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ విమానం ఏకంగా ఇళ్లను ఢీకొట్టుకుంటూ దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

వివరాల ప్రకారం.. పర్యాటకులతో గాల్లోకి వెళ్లిన విమానం తొలుత ఓ భారీ భవనాన్ని ఢీకొట్టిందని అధికారులు చెబుతున్నారు. ఆ భవనాన్ని ఢీకొట్టిన వెంటనే అక్కడ ఉన్న ఇళ్లను, దుకాణాలను ఢీకొడుతూ పర్నీచర్ ఉన్న మరో దుకాణంలో దూసుకెళ్లింది. పర్వత ప్రాంతంలోని గ్రామడో పట్టణం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి సాధించింది. ఈ ప్రాంతానికి అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. అయితే క్రిస్మస్ వేడుకలకు మరికొన్ని రోజులే సమయం ఉండడం, ఇలాంటి సమయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.