Site icon Prime9

Barack Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు విడాకుల ప్రచారం.. అదిరిపోయే ట్వీట్ చేసిన ఒబామా

Barack Obama shares birthdayBarack And Michelle Obama post in Amid divorce rumours: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా డివోర్స్ తీసుకుంటున్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై బరాక్ ఒబామా చెక్ పెట్టారు.

తన భార్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఈ మేరకు బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే మై లవ్.. మీరు నా లైఫ్‌లో హాస్యం, లవ్, దయ వంటివి నింపావు. మీతో కలిసి జీవితంలో సాహసాలు చేసినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. లవ్ యూ’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version