Site icon Prime9

Chinmoy Dass: చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్.. అదంతా తప్పుడు ప్రచారం.. మేము అండగా ఉంటాం.. ఇస్కాన్

Bangla Iskcon Supporting to Chinmoy Krishna Das’s rights and freedom: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌కు చెందిన ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను బంగ్లా ఇస్కాన్ దూరంగా ఉంచిందనే వార్తలు వైరమలల్ అవుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై హిందూ ఆధ్యాత్మిక సంస్థ ఖండించింది. చిన్మయ్ కృష్ణదాస్‌కు ఎప్పటిలాగే మేమంతా అండగా ఉంటామని ప్రకటించింది.

దేశంలోని హిందూవులను, హిందూవులు పూజించే స్థలాలాను కాపాడటంలో ఇస్కాన్ తోడుగా ఉంటుందని స్పష్టం చేసింది. బంగ్లాలోని హిందూ సంఘాలు, హిందువులకు అండగా ఉంటుందని పేర్కొంది. మైనార్టీలు శాంతియుతంగా జీవించే పరిస్థితులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుందని వివరించింది. కృష్ణదాస్‌ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఇస్కాన్ పేర్కొంది.

అయితే, బంగ్లాదేశ్‌లో హిందూవులపై దాడులు, ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును బ్రిటిష్ కన్జర్వేటివ్ ఎంపీ బాబ్ బ్లాకమన్ ఖండించారు. మైనారిటీ మతాల ప్రజలను వేధించడం ఆమోదయోగ్యం కాదని యూకే పార్లమెంట్‌లో ఆయన స్పష్టం చేశారు. దేవాలయాలు, హిందూవుల ఇళ్లపై కాల్పులు జరగడంతో సమాజం ప్రాణభయంతో బతుకుతోందన్నారు. అయితే ఇస్కాన్‌ను బ్యాన్ చేయించేందుకు ప్రయత్నించడం కూడా హిందూవులపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు.

ఇదిలా ఉండగా, హిందువులతో పాటు వారి ప్రార్థన స్థలాలను కాపాడుకునేందుకు చిన్మయ్ కృష్ణదాస్ శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జాతీయజెండాను అగౌరవపరిచారని రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ను రద్దు చేయాలని ఓ న్యాయమూర్తి పిటిషన్ వేశాడు. తర్వాత ఈ పిటిషన్‌ను బంగ్లాదేశ్ కోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version