Site icon Prime9

Kamala Harris: కమలా హారిస్ ప్రచారానికి విరాళాల వెల్లువ 

Donations flood Kamala Harris’ campaign: అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తుండగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ కమలాహారిస్ బరిలో నిల్చున్నారు. ఈ ఏడాది జూలైలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలాహారిస్ తెరపైకి రాగా.. అప్పటినుంచి ఆమెకు మద్దతు పెరుగుతూ వస్తోంది.

కమలాహారిస్ అభ్యర్థిత్వం ప్రకటించినప్పటినుంచి ఆమె ప్రచారానికి 1 బిలియన్ డాలర్లకుపైగా విరాళాలు సేకరించారు. ప్రస్తుతం అమెరికా వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న కమలా హారిస్‌ అధ్యక్ష అభ్యర్థిగా నిలిచినప్పటినుంచి భారీ స్థాయిలో ప్రజలు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

కమలాహారిస్ అభ్యర్థిగా ప్రకటించిన మొదటి రోజే ఏకంగా 25 మిలియన్‌ డాలర్ల విరాళాలు సేకరించారు. ఆ తర్వాత ఒక నెలలోనే 500 మిలియన్‌ డాలర్లు వసూలు చేశారు. దీంతో ఆమె ప్రచారం మరింత ఉద్ధృతమవుతోంది. మరోవైపు, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆగస్టులో 130 మిలియన్ డాలర్లు రాగా.. ఆ తర్వాత 294 మిలియన్ డాలర్లు అందాయి. ప్రజల్లోని మద్దతు సేకరించడానికి దూకుడుగ వ్యవహరిస్తున్నాయి. వంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాయి.

Exit mobile version