Prime9

Honeybees: 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

25 crores Honeybees escape after truck overturns in Washington: అమెరికాలోని వాషింగ్టన్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఏకంగా 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి. ఈ మేరకు అధికారులు అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

 

వివరాల ప్రకారం.. కెనడా సరిహద్దు ప్రాంతంలో ఓ ట్రక్కు 31,751 కిలోల తేనెతుట్టెలతో వెళ్తోంది. లిండెన్ సమీపంలోని కెనడా సరిహద్దు ప్రాంతంలో ఓ మూలమలుపు వద్ద వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోయాడు. దీంతో ఆ వాహనం బోల్తా పడింది.

 

అయితే, వాహనంలో ఉన్న తేనెతుట్టెలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో తేనెటీగలు బయటకు రాగా ఎగిరిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని తేనెటీగలు తేనెతుట్టెలను ఒక్క ప్రాంతానికి చేర్చారు. బయటకు వెళ్లిన తేనెటీగలు 25కోట్ల వరకు ఉంటాయని అంచనా వేశారు.

 

ఇదిలా ఉండగా, తప్పించుకున్న తేనెటీగల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ తేనెటీగలు రాణి ఈగలను విడిచి ఉండలేవని, తప్పనిసరిగా ఆ తేనెటీగలు రాణి ఈగల వద్దకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే మరో రెండు, మూడు రోజులు పరిసర ప్రాంతాలకు రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Exit mobile version
Skip to toolbar