Site icon Prime9

Vitamin B12: మీ శరీరంలో విటమిన్ బీ12 తగ్గిందా.. ఐతే ప్రమాదంలో పడినట్లే

Vitamin B12: కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఏ రోగాలు వస్తాయో కూడా ఎవరికి తెలియడం లేదు . ప్రస్తుతం చూసుకుంటే 47 శాతం మంది వరకు విటమిన్ బీ12 తో బాధ పడుతున్నారు. కేవలం 26 శాతం మందికి మాత్రమే విటమిన్ బీ12 ఉందని నిపుణులు ఓ పరిశోధనలో బయటికి వెల్లడించారు. కానీ కేవలం ఇది డెఫిషియన్సీ మాత్రమే కాదంట. ప్రస్తుతం చాలామంది కేవలం శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్, డిఎన్ఏ వంటి వాటిపై మాత్రమే శ్రద్ధ చూపుతున్నారు. కానీ మనిషి మెదడు, నరాలకు సంబంధించిన కణాలు కూడా బలంగా ఉండాలని నిపుణులు ఓ పరిశోధనలో వెల్లడించారు .

ఎప్పుడైతే విటమిన్ బీ12 మన శరీరంలో సరైన విధంగా ఉంటుందో అప్పుడు బ్రెయిన్, నరాల ఆరోగ్యం కూడా మనకి మెరుగ్గా ఉంటుంది. కాబట్టి విటమిన్ బీ12 డెఫిషియన్సీను ముందుగా మనం కనుక్కోవాలి. కనుక్కున్న తరువాత మనం ముందుగా కంటికి సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే మనం సరియిన వైద్యం తీసుకోవాలి. అలాగే నరాలకు సంబంధించిన సమస్యలు ఉన్నా వెంటనే వైద్యం తీసుకోవాలి.

విటమిన్ బీ12 వల్ల మన శరీరంలో వచ్చే సమస్యలు ఏంటంటే చర్మ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, కంటి ఆరోగ్యం దెబ్బతినడం, న్యూరాలజికల్ సమస్యలు లాంటి ఇలా అనేక సమస్యలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రకమైన లక్షణాలు ఉంటె వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు ఓ పరిశోధనలో వెల్లడించారు.

యూకేకు సంబంధించిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ సెంటర్ వారు ఇంకా కొన్ని లక్షణాలను తెలియజేశారు. ఎప్పుడైతే శరీరంలో విటమిన్ బీ12 డెఫిషియెన్సీ తగ్గుతుందో అప్పుడు మనకు ఎన్నో రకాల ఓరల్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. మౌత్ అల్సర్, సోర్స్, గ్లాసైటిస్, నాలుక ఎర్రగా మారడం, వాపు కలగడం వంటి మొదలగు ఇలా ఎన్నో మన శరీరంలో సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి తొందరగా తగు జాగ్రత్తలు తీసుకోని విటమిన్ బీ12 ను పెంచుకోండి.

Exit mobile version
Skip to toolbar