Site icon Prime9

హైపర్ సోమ్నియా అంటే ఏమిటి? లక్షణాలు.. సమస్యలు.

మనలో చాలా మందికి నిద్ర రుగ్మతలు చాలా సాధారణం. నిద్రలేమికి చికిత్స చేయడానికి అనేక రకాల మందులు వున్నాయి. మరోవైపు కొంతమందికి తగినంత ఎక్కువ నిద్ర ఉన్నప్పటికీ పగటిపూట మెలకువగా మరియు అప్రమత్తంగా ఉండలేరు. దీనిని హైపర్ సోమ్నియా అంటారు. ఇది పని జీవితం, సామాజిక మరియు గృహ జీవితానికి సవాళ్లను కలిగిస్తుంది. సుమారుగా, 5% మంది వ్యక్తులు హైపర్ సోమ్నియాతో బాధపడుతున్నారు ఇది సాధారణంగా కౌమారదశలో మరియు యవ్వనంలో నిర్ధారణ అవుతుంది. దీని కారణాలు తెలియవు, పరిశోధకులు న్యువుల పాత్రను అన్వేషిస్తున్నారు.

హైపర్ సోమ్నియా యొక్క లక్షణాలు:

తక్కువ శక్తి

చిరాకు

ఆందోళన

ఆకలి లేకపోవడం

నెమ్మదిగా ఆలోచించడం లేదా ప్రసంగం

గుర్తుంచుకోవడం కష్టంగా మారడం

చంచలత్వం

హైపర్ సోమ్నియాకు కారణాలు..

అనేక వ్యాధులకు రోజువారీ జీవితంలో ఒత్తిడి కారణమని చెప్పవచ్చు.

ఎక్కువ కాలం మద్యం సేవించడం

ఒక వైరల్ ఇన్ఫెక్షన్ తో ఎక్కువ కాలం బాధపడటం

బాల్యంలో తలకు తగిలిన  గాయం

జన్యుశాస్త్రం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇది కొన్ని రుగ్మతలకు కూడా దారి తీస్తుంది

డిప్రెషన్, మాదకద్రవ్య దుర్వినియోగం, బైపోలార్ డిజార్డర్, అల్జీమర్స్ వ్యాధి లేదా పార్కిన్సన్స్ వంటి మానసిక అనారోగ్యాల వైద్య చరిత్ర హైపర్ సోమ్నియా రుగ్మతకు దారితీయవచ్చు.

జీవనశైలి మార్పులు హైపర్ సోమ్నియా చికిత్స ప్రక్రియలో కీలకమైన భాగం. ఒక వైద్యుడు క్రమబద్ధమైన నిద్ర షెడ్యూల్‌లో ఉండాలని సిఫారసు చేయవచ్చు. కొన్ని కార్యకలాపాలను నివారించడం కూడా మెరుగుపరుస్తుంది,ఈ లక్షణాలు వున్న  వ్యక్తులు మద్యం తాగకూడదు. డ్రగ్స్ వాడకూడదు. వైద్యుడు అధిక పోషకాహార ఆహారాన్ని కూడా సిఫారసు చేయవచ్చు.

Exit mobile version
Skip to toolbar