Site icon Prime9

Vankaya Pachadi Recipe: వంకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుకుందాం..

vankaya-pachhadi

Vankaya Pachadi: వంకాయతో కూర వండటం, వంకాయతో కారం ఇంకా వంకాయతో పలు రకాల రెసిపిస్ చూసి ఉంటాము. ఈ రోజు కొత్తగా వంకాయ పచ్చడి చేద్దాం. వంకాయ పచ్చడి చేయాలంటే ముందుగా కావలిసిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

కావలిసిన పదార్థాలు..
4 వంకాయలు
100 గ్రాములు నూనె
సరిపడినంత చింతపండు
5 ఎండు మిర్చి
1టీ స్పూన్ ఆవాలు
సరిపడినంత ఉప్పు

తయారీ విధానం..
ముందుగా వంకాయలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలను చేసి, నూనెలో వేసి బాగా వేగిన తరువాత వాటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత 5 ఎండు మిర్చిని తీసుకొని నూనెలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండు మిర్చిని, చింత పండును, ఆవాలు తీసుకొని రోట్లో వేసి ముద్ద అయ్యే వరకు దంచాలి. దంచిన వంకాయ పచ్చడి ముద్దను తాలింపు పెట్టుకోవాలి. అంతే టేస్టీ వంకాయ పచ్చడి రెడీ.

Exit mobile version