Site icon Prime9

Bakrid recipes: సాంప్రదాయ వంటకాలతో బక్రీద్ మెనూ

Bakrid recipes: భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు  బక్రీద్ ను తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారు. కుటుంబ సభ్యులనే కాకుండా తమ స్నేహితులను కూడ విందుకు ఆహ్వానిస్తారు. ఈ సందర్బంగా మెనూలో  ఉండే సంప్రదాయ వంటకాల జాబితా ఇక్కడ ఉంది.

అవధ్ బిర్యానీ

అవధ్  బిర్యానీ లక్నోలో ప్రసిద్ధి చెందిన బిర్యానీ వంటకం. ఇదిమసాలా మిశ్రమాన్ని కలిగి  బిర్యానీ రుచిని పెంచుతుంది. బిర్యానీ బియ్యం మరియు లేత మటన్ ముక్కలతో పొరలుగా ఉంటుంది. పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు అవధ్  బిర్యానీకి  మంచి రుచిని ఇస్తుంది

గోష్ట్ ఖిచ్డా

గోష్ట్ ఖిచ్డా అనే సంప్రదాయ వంటకాన్ని బియ్యం, పప్పు, మటన్ మరియు మసాలాలతో తయారు చేస్తారు. ఇది మటన్, గోధుమలు లేదా బార్లీ, వివిధ రకాల పప్పులు, బియ్యం, సుగంధ ద్రవ్యాలు మరియు ఇతర పదార్థాలతో  వండుతారు.  తరువాత పచ్చి కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయ మరియు గరం మసాలాను జతచేస్తారు

షామీ కబాబ్ లు 

మమటన్ షామీ కబాబ్‌లు మంచి  అల్పాహారం. మసాలా దినుసులతో తయారు చేసిన లేత మటన్ కబాబ్‌లు చాలా రుచికరంగా వుంటాయి.

పప్పు, మటన్, ఉల్లిపాయలు, మిరపకాయలు మరియు వివిధ రకాల మసాలాలతో నింపబడి ఉంటాయి.

మటన్ పాయ

హైదరాబాదీ మటన్ పాయ మాంసాహార ప్రియులకు  అద్భుతమైన మరియు ఆహ్లాదకరమైన ట్రీట్ . దీనిని ఒకసారి రుచిచూస్తే వదిలిపెట్టరు.

నల్లి భున

సాంప్రదాయ ఈద్ వంటకాల విషయానికి వస్తే, నల్లి భున అనేది జాజికాయ పొడి, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ సోంపు మరియు ఇతర మసాలా దినుసులతో కూడిన సాంప్రదాయ మొఘలాయి మటన్ కర్రీ వంటకం.ఇది  బటర్ నాన్ లేదా రుమాలి రోటీకి సరిపడా వంటకం ఇది.

షీర్ ఖుర్మా

షీర్ ఖుర్మా అనేది సాంప్రదాయ ఈద్ వంటకం. వెర్మిసెల్లి, ఖర్జూరం, గింజలు మరియు పాలు ఈ రుచికరమైన తయారీకి ఉపయోగిస్తారు. ఈద్ మెనులో షీర్ ఖుర్మా ఉండాలి.

షాహి తుక్డా

షాహి తుక్డా, డబుల్ కా మీఠా అని కూడా పిలుస్తారు, ఇది పండుగలు మరియు వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాలలో అందించే ప్రసిద్ధ హైదరాబాదీ

స్వీట్ ఇది రొట్టె మరియు పాలతో తయారు చేసే స్వీట్.  బాదం, పిస్తా, గులాబీ రేకులు  వంటి డ్రై ఫ్రూట్స్‌తో దీని రుచి అద్భుతంగా వుంటుంది ఇది భోజనం తరువాత తప్పకుండా తీసుకోవాలి. ఫిర్ని అనేది  పంచదార, బియ్యం, పాలు మరియు డ్రై ఫ్రూట్స్‌తో తయారుచేసే  స్వీట్. భోజనం తరువాత తీసుకునే మరో  తీపివంటకం.

Exit mobile version