Site icon Prime9

Rayalaseema Special Uggani: రుచికరమైన రాయలసీమ బ్రేక్ ఫాస్ట్ ఉగ్గాని

Rayalaseema Special Uggani Recipe: మర‌మ‌రాలు అంద‌రికీ తెలిసిన‌వే. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల ఆహార‌ ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌ర‌మ‌రాల‌ను మ‌నం ఎక్కువ‌గా స్నాక్స్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. వీటిని బియ్యం నుండి త‌యారు చేస్తారు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు అన్నాన్ని ఎక్కువ‌గా తిన‌రు. కానీ బియ్యంతో త‌యారు చేసిన మ‌ర‌మ‌రాల‌ను తిన‌వ‌చ్చు. నాన‌బెట్టిన బియ్యాన్ని వేయించడం వల్ల అవి పొంగి చాలా తేలిక‌గా ఉండే మ‌ర‌మ‌రాలుగా త‌యార‌వుతాయి. రాయలసీమలో, దక్షిణ కర్ణాటకలో మరమరాలతో తయారు చేసే అల్పాహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. దీనిని ఉగ్గాని అంటారు.

తయారు చేయు విధానం:
మరమరాలను నీళ్ళలో నానబెట్టి నీటిని మొత్తం వడగట్టాలి.పుట్నాలుఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు (లేదా కారంపొడి) మిక్సీలో వేసుకోవాలి. దీనిని నానిన మరమరాలతో కలిపి ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని, పోపు గింజలతో దోరగా వేయించుకోవాలి. దీనికి రుచికోసం టమోటా ముక్కలను కూడా చేర్చుకోవచ్చును. మరమరాలకు పోపు పెట్టుకోవాలి. పొయ్యి పై నుండి దించిన తర్వాత నిమ్మకాయ కూడా పిండుకుని తింటే చాల రుచిగా వుంటుంది. దీనినే అనంతపురంలో ఉగ్గానిగా, కర్నూలులో బొరుగుల తిరగవాతగా, కడపలో బొరుగుల చిత్రాన్నంగా మరి కొన్ని చోట్ల బొరుగుల ఉప్మాగా వ్యవహరిస్తారు.

Exit mobile version