Prawns fired Rice: ఈ రోజుల్లో నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు. అలాగే తినని వాళ్ళు కూడా లేరు. మనం చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పడి చస్తాం. కారం కారంగా తింటే ఇంకా చాలా బావుటుంది. ఆ రుచిని మాటల్లో చెప్పలేము ఆస్వాదిస్తూ తింటుంటే ఆ రుచే వేరబ్బా. ఐతే మనం ఇప్పటి వరకు అయితే ఎక్కువగా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని ఉంటాము కానీ ఎప్పుడు రొయ్యల ఫ్రైడ్ రైస్ ట్రై కూడా చేసి ఉండరు. ఇది చేసుకొని తిన్నాక టేస్ట్ కూడా బావుటుంది. దీన్ని చేయడం కోసం మనం ఎక్కడికో వెళ్లాలిసిన అవసరం లేదు. మనం దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికి కావాలిసిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
1/4 పావు కేజీ చిన్న రొయ్యలు
2 కప్పులు వండిన అన్నం
అర స్పూన్ మిరియాల పొడి
ఒక గుడ్డు
1/2 స్పూన్ సోయా సాస్
1 ఉల్లిపాయ
నాలుగు రెబ్బలు వెల్లుల్లి
1 స్పూను ఫిష్ సాస్
2 స్పూన్లు నూనె
1 క్యారెట్
పసుపు సరిపడినంత
1 స్పూను కారం
2 స్పూన్లు కొత్తిమీర తరుగు
తయారీ విధానం..
1. ముందుగా మనం పచ్చి రొయ్యలు తీసుకొని, వాటిని నీళ్ళతో బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి.
2. ఆ తరువాత పాన్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్లు నూనెను వేసుకోవాలి. నూనె కాగిన వెంటనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి.
3. వాటిలో రొయ్యలను వేసుకొని రంగు ఎర్రగా మారే వరకు వేయించాలి.
4. రొయ్యలు వేగిన తరువాత పసుపు, కారం కూడా వేసుకొని రొయ్యలను ఉడకనివ్వాలి.
5 .ఉడికిన రొయ్యల్లో కోడి గుడ్డు ఒకటి వేసుకొని కలిసిపోయే వరకు తిప్పుకోవాలి.
6.ఇప్పుడు ఉల్లిపాయను, క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
7.ఆ తరువాత వండిన అన్నం, ఫిష్ సాస్, సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు అన్నీ ఒకదాని తరువాత ఒకటి వేసుకొని కలుపుకోవాలి.
8. చివరిగా దించే ముందు కొత్తిమీరను వేసుకొని తిప్పండి.
అంతే రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ .