Site icon Prime9

Poha Recipe: పోహా..బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్స్ కు పదినిమషాల్లో రెడీ

Poha Recipe: సిటీలైఫ్ లో కొందరికి కనీసం బ్రేక్‌ఫాస్ట్ తినేందుకు కూడా సమయం చిక్కడం లేదు. ఇలాంటివారు చాల తక్కువసమయంలోనే పోహానుతయారు చేసుకోవచ్చు.ఇంట్లో అటుకులు, నిమ్మకాయ, పోపులు, పల్లీలు అందుబాటులో ఉంటే చాలు కేవలం 10 నిమిషాల్లో పోహా తయారవుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వుంటాయి.

కావల్సిన పదార్థాలు:
అటుకులు- 1 కప్పు,కొత్తిమీర – కొద్దిగా,కరివేపాకు- 2 రెమ్మలు,నిమ్మరసం -2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర- 1/2 టీస్పూన్,వెల్లుల్లి ముక్కలు- 1/2 టీస్పూ
పసుపు- 1/4 టీస్పూన్,పచ్చిమిర్చి- 3,పెద్ద ఉల్లిపాయ,వేరుశెనగలు (పల్లీలు)- 2 టేబుల్ స్పూన్స్ ,పచ్చి బఠాణి -3 టేబుల్ స్పూన్స్,ఉప్పు వుండాలి

ముందుగా అటుకులను శుభ్రమైన నీటితో కడగాలి. తరువాత స్టవ్‌పై పెనం పెట్టి తగినంత నూనె పోసి వేడిచేయాలి. ఆ తర్వాత జీలకర్ర, వేరుశెనగ పప్పు, పచ్చి మిర్చి, పసుపు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.తరువాతఉలిపాయ ముక్కలు, పచ్చి బఠాణిలు వేసి కాసేపు వేయించాలి.
ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న అటుకులను అందులో వేసి బాగా కలపాలి.నిమ్మరసంలో తగినంత ఉప్పు వేసి కలపి మిశ్రమాన్ని అటుకుల్లో వేయాలి. నిమ్మరసం అంతా అటుకుల్లో బాగా కలిసేలా కలపాలి. అంతే పోహా రెడీ. ఇందులో మిక్చర్ వేసుకుంటే కరకరలాడుతూ మరింత టేస్టీగా ఉంటుంది.. దీన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా తినొచ్చు. ఉత్తరభారతంలో దీన్ని పోహా అంటే మనవేపు అటుకుల ఉప్మా అంటారు.

Exit mobile version
Skip to toolbar