Site icon Prime9

Kajjikayalu Recipe: కజ్జికాయలు తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

food recipe prime9new

food recipe prime9new

Kajjikayalu Recipe: మనలో చాలామంది ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళగానే ఏవో ఒకటి తింటూ ఉంటాము. ఆ సమయంలో మనం అన్నం వండుకొని తినే సమయానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా మనకి సెలవు రోజు వచ్చినప్పుడు ఏదో ఒక పిండి వంట చేసుకుంటే ఆఫీసు నుంచి రాగానే తినవచ్చు. అలాంటి పిండి వంటల్లో కజ్జికాయలు కూడా ఒకటి. కజ్జికాయలు ఎలా చేసుకోవాలో, దానికి కావలిసిన పదార్ధాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకుందాం.

కావలిసిన పదార్ధాలు :
500 గ్రా -మైదా
6 టేబుల్‌ స్పూన్లు – నెయ్యి
500 గ్రా – కోవా
1/2 టీ స్పూన్ – ఏలకుల పొడి
25 గ్రా – బాదంపప్పు
25 గ్రా – కిస్‌మిస్‌
25 గ్రా – ఎండు కొబ్బరి తురుము
350 గ్రా – పంచదార పొడి
సరిపడినంత నూనె

తయారీ విధానం :
ముందుగా మైదా తీసుకొని దానిలో నెయ్యి , రెండు కప్పుల నీళ్ళు పోసుకొని కలిపి, ముద్ద లాగా చేసుకోవాలి. ఆ తరువాత కోవాను తీసుకొని నూనెలో వేసి అది గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. వేయించిన వాటిలో పంచదార, ఏలకులు, బాదం పప్పు , జీడిపప్పు, కిస్‌మిస్, కొబ్బరి తురుము అన్ని ఒకేసారి వేసి, బాగా కలుపుకొని రెండు నిమిషాలు పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మైదాపిండిని తీసుకొని వాటిని చిన్న ముద్దలుగా చేసి, ఆ ముద్దను పూరీలా చేసుకొని, దానిలో కోవా మిశ్రమం వేసి రెండు వైపులా పూరి చివర మూసి కజ్జికాయ మాదిరిగా చేసుకోవాలి. ఇప్పుడు పూరితో ఉన్నా దానిని తీసుకొని, గ్యాస్ మీద పాన్ పెట్టి దానిలో నూనె వేసి కాగిన వెంటనే కజ్జికాయలు వేసి, అది గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. అంతే వేడి వేడి కజ్జికాయలు రెడీ.

Exit mobile version