Palakayalu Recipe: సాయంకాలం స్నాక్స్ గా పాలకాయలు..

పాలకాయలు ఆంధ్రులకు ప్రత్యేకమైన వంట. వీటిని బియ్యం పిండితో తయారుచేస్తారు. ఇవి కరకరలాడుతూ సాయంకాలం స్నాక్స్ లాగా తినడానికి బాగుంటాయి.

  • Written By:
  • Publish Date - August 16, 2022 / 03:51 PM IST

Palakayalu Recipe: పాలకాయలు ఆంధ్రులకు ప్రత్యేకమైన వంట. వీటిని బియ్యం పిండితో తయారుచేస్తారు. ఇవి కరకరలాడుతూ సాయంకాలం స్నాక్స్ లాగా తినడానికి బాగుంటాయి.

కావలసిన పదార్ధాలు..
బియ్యం పిండి
వెన్న
ఉప్పు, కారం, నువ్వుపప్పు, వాము, జీలకర్ర మొదలైనవి.

తయారుచేసే విధానం..

ఎంత పిండి పాలకాయలు చేద్దామనుకుంటే దానికి సమాన పరిమణంలో నీరు పొయ్యి మీద ఎసరు పెట్టాలి. మరుగుతున్న నీటిలో తగినంత ఉప్పు, కారం, నువ్వుపప్పు, వాము, జీలకర్ర, ఇంగువ ఇలా మనకు కావలసినవి వేసుకోవాలి. బియ్యం పిండిలో వెన్నముద్ద వేసి, ఉండలు కట్టకుండా బాగా కలపాలి. మరుగుతున్న నీటిలో ఈ వెన్న కలిపిన బియ్యం పిండిని పోసి ఉండాలు కట్టకుండా కలపాలి. అడుగంటకుండా గిన్నెను దించి అలా వుంచెయ్యాలి.

అలా ఉడికిన పిండి అయిదారు గంటలు నానాలి. తరువాత చేతికి నూనె రాసుకుంటూ, ఈ మొత్తం పిండిముద్దని కుంకుడు కాయంత ఉండలు చేసుకోవాలి. ఈ గోళీలను ఒక బట్టమీద వేస్తూ ఆరనివ్వాలి. పొయ్యి మీద బూరెల మూకుడు పెట్టి వనస్పతి గాని, నూనె గాని పోసి ఒక్కొకసారి చారెడు గోళీలు చొప్పున పోసి వేగనివ్వాలి. గోధుమరంగు వచ్చేవరకు వేగనిచ్చి తీసేస్తుండాలి. వేగిన పాలకాయలను వేడి చల్లారిన తరువాత సీసాలోనో లేదా డబ్బాలోనో పోసి ఉంచుకోవాలి. ఇవి సాయంత్రంపూట స్నాక్స్ గా తినడానికి బాగుంటాయి.