Site icon Prime9

Chicken Pakodi: కరకరలాడే చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం!

chicken pakodi prime9news

chicken pakodi prime9news

Chicken Pakodi Recipe: ఇంట్లో మనం ఆదివారం రాగానే చికెన్ కూర, చికెన్ బిర్యాని చేసుకుని తింటాము. చికెనుతో అనేక వైరటీలు చేసుకొని తినవచ్చు. చికెనుతో శెనగపిండి పకోడీలు వేసుకొని తింటే ఉంటుంది, అబ్బా వింటూంటేనే బాగుంది కదా. ఇక తింటుంటే రుచి భలేగా ఉంటుంది. ఈ చికెన్ పకోడీలు కొంచెం కరకరలాడుతూ కొంచెం మెత్తగా చేసుకుని తింటే బావుంటాయి. ఐతే ఇలా టేస్టీగా, కరకరలాడాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ చూద్దాము. అలాగే చికెన్ పకోడీకి కావలిసిన పదార్ధాలు మరియు తయారీ విధానం మరియి కూడా ఇక్కడ చదివి తెలుసుకుందాము.

కావలసిన పదార్ధాలు..

చికెన్ – 1/2 కేజి
1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్
ఒక నిమ్మకాయ
2 టేబుల్ స్పూన్లు కారం
రుచికి తగినంత ఉప్పు
1 టేబుల్ స్పూన్ గరంమసాలా
1 టేబుల్ స్పూన్ జీలకర్ర
రెండు రెబ్బలు కరివేపాకు తరుగు
కొంచెం కొత్తిమీర తరుగు
2 టేబుల్ స్పూన్లు బియ్యపుపిండి
2 టేబుల్ స్పూన్లు శెనగపిండి

తయారీ విధానం..

ముందుగా చికెన్ ముక్కల్ని తీసుకుని, వాటిని బాగా శుభ్రం చేసుకొని, తరువాత ఆ ముక్కల్ని 20 నిమిషాలు పాటు ఉప్పు నీటిలో ఉంచి ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. 20 నిమిషాలు అయ్యాక ముక్కల్ని తీసి వేరే గిన్నెలోకి తీసుకొని వాటికి అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరంమసాలా పొడి, నిమ్మకాయ రసం, వేయించిన జీలకర్ర పొడి వేసి,చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. ఉప్పు నీటిలో ముక్కలు ఉన్నాయి కాబట్టి, రుచికి తగినంత ఉప్పును మాత్రమే వేసుకోవాలి. లేదంటే టేస్ట్ మారిపోతుంది. ఈ మిశ్రమానికి కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బియ్యంపిండి, శెనగపిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక గంట సేపు ఫ్రిజ్లో ఉంచాలి. ఇలా ఫ్రిజ్లో ఉంచడం వలన చికెన్ ముక్కలు మెత్తగా, కరకరలాడుతూ ఉంటాయి. గంట తరువాత ఒక పాన్ గ్యాస్ మీద పెట్టి నూనె వేసుకొని అది వేడయ్యేవరకు ఉంచాలి. నూనె వేడయ్యాక సన్నని మంట మీద ఉంచి, చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ముక్కలను నూనెలో బాగా ఎర్రగా ఏగానివ్వాలి. ఆ తరువాతా వాటిని తీసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి. అంతే వేడి వేడి చికెన్ పకోడి రెడీ.

Exit mobile version