Site icon Prime9

Jwala Gutta-Vishnu Vishal: తల్లిదండ్రులైన గుత్తా జ్వాలా, విష్ణు విశాల్‌.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌

Jwala Gutta and Vishnu Vishal Blessed With Baby Girl: తమిళ నటుడు విష్ణు విశాల్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి జ్వాలా గుత్తా దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ శుభవార్తను విష్ణు విశాల్‌ సోషల్‌ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. తమ నాలుగవ పెళ్లి రోజునే తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోయాడు. ఈ మేరకు పాప చేతిని విష్ణు విశాల్‌, గుత్తా జ్వాల పట్టుకుని ఉన్న ఫోటోని షేర్‌ చేశాడు. దీనికి ఇలా రాసుకొచ్చాడు. “మాకు ఆడిపల్లి జన్మించింది.

 

ఆర్యన్‌ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. మా నాలుగవ పెళ్లి రోజునే ఆ భగవంతుడిని నుంచి ఈ అద్భుతమైన బహుమతితో ఆశీర్వదించబడ్డాము. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు మాకు ఎప్పటికి కావాలి” అంటూ రాసుకొచ్చాడు. కాగా విష్ణు విశాల్, గుత్తా జ్వాలలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు 2021 ఏప్రిల్‌ 22న పెద్దల సమక్షంలో వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. కాగా వీరిద్దరికి ఇది రెండవ పెళ్లి అనే విషయం తెలిసిందే.

 

గుత్తా జ్వాల 2005లో బ్యాడ్మింటన్‌ క్రిడాకారుడు చేతన్‌ ఆనంద్‌ను వివాహం చేసుకుంది. సుమారు ఆరేళ్లు అన్యోన్యంగా జీవించిన వీరు మనస్పర్థలు కారణంగా విడిపోయారు. ఇక విష్ణు విశాల్‌ కూడా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌ను 2011లో పెళ్లి చేసుకున్నాడు. పలు విభేదాల వల్ల 2018లో విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే.. విష్ణు, రజనీలకు ఆర్యన్‌ జన్మించాడు. ఇప్పుడు విష్ణు విశాల్‌, గుత్తా జ్వాలల ప్రేమకు గుర్తుగా కూతురు జన్మించింది. వీరి పెళ్లి రోజు నాడే కూతురు జన్మించడంతో వారి ఇంట్లో సెలబ్రేషన్స్‌ మరింత రెట్టింపు అయ్యాయి.

Exit mobile version
Skip to toolbar