Site icon Prime9

Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘సాహిబా’ ఫుల్ సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్ ఫిదా

Vijay Deverakonda Sahiba: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలకు భిన్నంగా మ్యూజిక్ ఆల్బమ్‌లో నటిస్తున్నారు. ఈ ఆల్బమ్‌ ‘సాహిబా’ అనే టైటిల్‌తో ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో మేల్ లీడ్‌గా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. ఫీమేల్ లీడ్‌లో హీరోయిన్ రాధిక మదన్ నటిస్తోంది. ఈ మ్యూజిక్ ఆల్బమ్‌కు సుధాన్షు సరియా దర్శకత్వం వహించగా.. పాటలకు బాలీవుడ్ సింగర్ జస్లీన్ రాయల్ కంపోజ్ చేశారు.

తాజాగా, ఈ మ్యూజిక్ ఆల్బమ్‌కు సంబంధించిన ప్రోమోపై అప్డేట్ ప్రకటించారు.. ఈ మేరకు ‘మాటలకు అతీతంగా.. కాలానికి మించి- ఒక ప్రేమకథ ఎదురుచూస్తోంది’ అంటూ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ ఓ ప్రముఖ ఫోటోగ్రాఫర్‌గా కనిపించగా.. విజివల్స్ ఆకట్టుకుంటున్నాయి. రాధిక, విజయ్ మధ్య సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు.

జస్లీన్ విషయానికొస్తే.. గతేడాది హీరియే సాంగ్‌కు కంపోజ్ చేయగా.. వరల్డ్ వైడ్ హిట్ కొట్టింది. ఆ సాంగ్‌లో మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం కంపోజ్ చేసిన సాంగ్ కూడా అంతకుమించి ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్‌కు మ్యూజిక్ లవర్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా, విడుదలైన ‘సాహిబా’ ఆల్బమ్‌లో విజయ్ దేవరకొండ నటించారు. విజయ్‌కి జోడిగా రాధిక మదన్ నటించింది. అయితే విజయ్, రాధికలు కలిసి నటించడం ఇదే తొలిసారి.

ఇక, విజయ్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమాల్లో ‘లైగర్’, ఖుషీ’, ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు అనుకున్నంత విజయాలు సాధించలేదు. ప్రస్తుతం జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు.

Exit mobile version