Site icon Prime9

Veekshanam: థ్రిల్లర్ మూవీ ‘వీక్షణం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

veekshanam Pre-release event: రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘వీక్షణం’. ఈ సినిమాను ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తుండగా.. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి రూపొందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్బంగా డీఓపీ సాయిరామ్ మాట్లాడుతూ.. వీక్షణం సినిమాకు పని చేయడం సంతోషంగా ఉందన్నారు. మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. విజువల్స్ బ్యూటిఫుల్ గా వచ్చేందుకు ప్రతి ఒక్కరు తమ ఎఫర్ట్స్ పెట్టారన్నారు. ఈ సినిమా శుక్రవారం థియేటర్స్ లోః విడుదల కానుంది.

వీక్షణం సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి అన్నారు. ఈ పాటలు ఇంత బాగా రావడానికి డైరెక్టర్ మనోజ్ సపోర్ట్ చేశారని, ఈ మూవీలో బీజీఎం కూడా ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. క మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనభూతిని వీక్షణం అందిస్తుందని చెప్పారు. నటుడు షైనింగ్ ఫణి మాట్లాడుతూ.. వీక్షణం సినిమాలో నేను హీరోకు ఫ్రెండ్ రోల్ లో నటించానన్నారు. ఈ మూవీలో నటిస్తున్నప్పుడు ఒక వెకేషన్ కు వెళ్లిన ఫీల్ కలిగిందని, ఎక్కడా మూవీ చేస్తున్నామని అనిపించలేదన్నారు. వీక్షణం మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే థ్రిల్లర్ మూవీ అవుతుందన్నారు.

వీక్షణం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ హీరోయిన్ కశ్వి థ్యాంక్స్ చెప్పారు. వీక్షణం టీమ్ తో కలిసి వర్క్ చేయడం బాగుందన్నారు. దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ.. వీక్షణం తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. సక్సెస్ మీట్ లో మిమ్మల్ని మళ్లీ కలుస్తానన్నారు. అనంతరం హీరో రామ్ కార్తీక్ మాట్లాడారు. వీక్షణం వంటి ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఇచ్చిన డైరెక్టర్ మనోజ్ కి థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో సరికొత్తగా ఉంటూ ఆకట్టుకుంటుందన్నారు.

Exit mobile version