Site icon Prime9

Saptagiri Mother Died: కమెడియన్‌ సప్తగిరి ఇంట తీవ్ర విషాదం!

Saptagiri Mother Chittemma Died: కమెడియన్‌ సప్తగిరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి చిట్టెమ్మ మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని సప్తగిరి స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘మిస్ యూ అమ్మ.. రెస్ట్ ఇన్ పీస్’ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో పలువురు నటీనటులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

అలాగే పలువురు నటీనటులు స్వయంగా వెళ్లి సప్తగిరిని పరామర్శించారు. మరికొందరు సోషల్‌ మీడియా వేదికగా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. తన తల్లి మరణవార్తను షేర్‌ చేసుకుని ఎమోషనల్‌ అయ్యాడు సప్తగిరి. మంగళవారం ఆమె మరణించగా.. బుధవారం తమ స్వగ్రామం తిరుపతిలో చిట్టెమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

 

సప్తగిరి సినిమాల విషయానికి వస్తే.. అతడి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్‌. 2006 బొమ్మరిల్లు మూవీతో పరిశ్రమలోకి వచ్చాడు. ఓయ్‌, ప్రేమకథా చిత్రం, పరుగు, గబ్బర్‌ సింగ్‌, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, వంటి చిత్రాల్లో నటించాడు. ప్రేమకథా చిత్రంలో తన కమెడితో మంచి గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో కమెడియన్‌ తనదైన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టకున్నాడు. ఇప్పటి వరకు 100 నుంచి 150పైగా సినిమాలు చేశాడు. ఇటీవల పెళ్లికాని ప్రసాద్‌ అనే మూవీతో హీరోగా మారాడు. మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్పలోనూ నటించాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

 

 

Exit mobile version
Skip to toolbar