Game Changer Trailer Out: గ్లోబల్ స్టార్ట్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. శంకర్ ఈ సినిమాని పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కోసం అటు మెగాఫ్యాన్స్ నుంచి సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
కొత్త సంవత్సరం రోజున, మేకర్స్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌తో పాటు రామ్ చరణ్ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ డిఫరెంట్ ఛారెక్టర్స్‌లో కనిపిస్తారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, అంజలి మరో కథనాయికగా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.యాక్షన్‌తో కూడిన పొలిటికల్ డ్రామాతో ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో రామ్ చరణ్, కియారా అద్వానీలతో పాటు ఎస్‌జే సూర్య కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి రోజున గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా తమిళనాడులో శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్‌కు పెద్ద ఎంట్రీ. ఇంతకుముందు తమిళంలో మగధీరలో విజయం సాధించాడు. అజిత్ సినిమా విడముయార్చి రిలీజ్ డేట్ పొడిగించడంతో రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ భారీ విజయాన్ని అందుకోనుంది. గేమ్ ఛేంజర్ జనవరి 10, 2025న థియేటర్లలో విడుదల కానుంది.