Site icon Prime9

Tollywood : సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం

Tollywood

Tollywood : తెలుగు చిత్ర పరిశ్రమలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని నిజాంపేటలో తన భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు. రెండు రోజులుగా తలుపు తెరవకుండా ఇంట్లోనే ఉండిపోయారు. తలుపు ఎంత కొట్టినా తెరవకపోడంతో కుటుంబ సభ్యులు, అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కల్పిన ఇంటికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి తెరిచారు.

అప్పటికే కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కల్పన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సింగర్ కల్పన తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో అనేక సాంగ్స్ పాడారు. ఇటీవల పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై కూడా ఆమె మాట్లాడారు. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్‌ను ఒంటరి చేశారంటూ మద్దతు ఇచ్చారు.

Exit mobile version
Skip to toolbar