Prime9

Master Bharat Mother Died: నటుడు మాస్టర్‌ భరత్‌ ఇంట తీవ్ర విషాదం!

Actor Master Bharat Mother Died: మాస్టర్‌ భరత్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్‌ ఆర్టిస్టుగా తెలుగులో ఎన్నో సినిమాలు చేసి అలరించాడు. రేడీ చిత్రంలో అతడు చేసిన కామెడీ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆనందామానందమాయే సినిమాలో మాస్టర్‌ భరత్‌ పాత్రను ఎప్పటికీ మర్చిపోలేరు. బాలనటుడిగా ఈ సినిమా అమాయకంగా కామెడీ చేస్తూ ఎంతోమంది ప్రేక్షకులకు మంత్రముగ్దులను చేశారు.

 

ప్రస్తుతం సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్న భరత్‌ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతడి తల్లి కమలసుహాసిని.. ఆదివారం రాత్రి చెన్నైలో మరణించారు. దీంతో భరత్‌ సహానటీనటులు అతడి తల్లి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు. చెన్నైలోని భరత్‌ ఇంటికి బంధుమిత్రులు, సినీ ప్రముఖులు వెళ్తూ సానూభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ కఠిన సమయంలో అతడికి, అతడి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ఆశిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాల్లో భరత్‌ బాలనటుడిగా నటించిన మంచి గుర్తింపు పొందాడు.

 

తనదైన నటన, అల్లరితో ఆడియన్స్‌ని కట్టిపడేశాడు. ముఖ్యంగా డైరెక్టర్‌ శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ, ఢీ, కింగ్‌, రెడీ సినిమాల్లో భరత్‌ చేసిన కామెడీ పాత్రలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌ అనే చెప్పాలి. ఇక పెద్దయ్యాక అల్లు శిరీస్‌ ఏబీసీడీ మూవీతో నటుడిగా మారాడు. చివరగా గోపిచంద్‌ విశ్వం మూవీలో అలరించాడు. గతేడాది విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. అయితే భరత్‌ ప్రస్తుతం పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇలా కఠిన సమయంలో అతడు తల్లి కోల్పోవడం మరింత వేధిస్తోంది.

 

Exit mobile version
Skip to toolbar