Site icon Prime9

Mukesh Gowda : మొదటి సారి తన తండ్రి గురించి చెప్పిన గుప్పెడంత మనసు హీరో

mukesh gowda prime9news

mukesh gowda prime9news

Mukesh Gowda : మోడలింగ్‌తో తన కెరియర్ మొదలు పెట్టిన ముఖేష్ గౌడ.. 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ ను గెల్చుకున్నాడు.ఆ తరువాత కన్నడలో అడుగుపెట్టి ‘నాగకన్నిక’ అనే సీరియల్‌తో డెబ్యూ హీరోగా మన ముందుకు వచ్చాడు.‘ప్రేమ నగర్’ సీరియల్‌తో తెలుగు టెలివిజన్లో ముఖేష్ అడుగుపెట్టాడు. ప్రస్తుతం స్టార్ మాలో ‘గుప్పెంత మనసు’ సీరియల్‌లో రిషిగా తన అద్భత నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

రిషి అంటే ఒక కోపిస్టూ మనిషిగా గుప్పెడంత మనసు సీరియల్‌లో కనిపిస్తాడు.ప్రస్తుతం వసుధారతో అతని లవ్ ట్రాక్ చాలా క్యూట్‌గా అనిపిస్తుంది.ఇక తల్లి జగతితో రిషి సీన్స్ ఐతే గుండెల్ని పిండేస్తాయి.ఇక తండ్రి మహేంద్రతో అయితే అసలు వీళ్లు నటిస్తున్నారా? లేక జీవిస్తున్నారా? అన్నట్టుగా ఉంటుంది. ప్రతి తండ్రికి ఇలాంటి కొడుకు ఒక్కడు ఉంటే చాలని అనేంతగా ఎమోషన్స్ పండిస్తాడు రిషి.

స్టార్ మా అవార్డ్స్ వేడుకలో ముఖేష్ తన తండ్రి గురించి ఈ విధంగా మా నాన్నని నేను నాకే పుట్టిన కొడుకులా చూసుకున్నాను.. అందరి లైఫ్‌లో ఇలా జరుగుతుందో లేదో నాకు తెలియదు.కానీ నా జీవితంలో జరిగింది’ అంటూ రిషి తండ్రిని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. తండ్రికి అన్నం తినిపిస్తూ.. గెడ్డం గీస్తూ.. ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ రిషి కనిపించాడు . కదల్లేని స్థితిలో ఉన్న తండ్రిని..చూస్తూ తను కన్న కొడుకులా చూసుకుంటూ తండ్రిగా మారాడు రిషి.

Exit mobile version