Site icon Prime9

Karthika deepam: సెప్టెంబర్ 14 ఏపిసోడులో మోనిత కొత్త స్కెచ్ హైలెట్

sep 14 karthikadeepam prime9news

sep 14 karthikadeepam prime9news

Karthika deepam: నేటి కార్తీక దీపం ఎపిసోడ్లో మోనిత కొత్త స్కెచ్ హైలెట్.ఆ స్కెచ్ ఏంటో ఇక్కడ చదివి తెలుకుందాం. మోనిత కోసం ఇద్దరూ ఆడవాళ్ళు ఆమె ఇంటికి వస్తారు.మోనిత బయటికి వచ్చి వాళ్ళను చూస్తుంటుంది అప్పుడు వారు ‘మేడమ్ మీ భర్త గతం మర్చిపోయారంట కదా’అని మోనితను అడుగుతారు. అదే సమయంలో దీప కూడా మోనిత ఇంటి వైపే వెళ్తుంది. మోనితను చూసి వాళ్ళు మాట్లాడుకునే మాటలను దీప చాటుగా అన్ని వింటుంది. మోనిత ‘అవును, అయితే ఏంటీ?’ అంటుంది ‘అది కాదు మేడమ్, మేము మిమ్మలని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాం. మేము ప్రకృతి వైద్యశాలలో పని చేస్తాం. ఇక్కడి నుంచి 150 కిలోమీటర్ల దూరంలో మా ప్రకృతి వైద్యశాల ఉంది. అక్కడ మీరు ఏడు రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే మీ భర్తకు మర్చిపోయిన గతమంతా గుర్తొస్తుందని చెబుతారు. ఇప్పుడు మాకు ‘అవేం అవసరం లేదు. మా దగ్గర డబ్బులు కాజేయలని మీరు ఇలాంటి ప్లాన్స్ వేస్తున్నారని నాకు తెలుసు అని అంటుంది మోనిత. అప్పుడు వాళ్ళు ‘లేదు మేడమ్ మేము నిజమే చేప్తున్నాం మమ్మల్ని నమ్మండి మీకు మంచి ఫలితం ఉంటుందని చెబుతారు అక్కడితో ఈ సీను ముగుస్తుంది.

వాళ్ళ మాటలన్ని విన్న దీప ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. మనం సీరియల్ చూసేటప్పుడు ఈ సీను అర్ధమవుతుంది. మోనిత ఈ స్కెచ్ దీప కోసమే ప్లాన్ చేసినట్టు ఉంది. దీప వాళ్ళ మాటలను నమ్మి అక్కడికి వెళ్లాలని ఈ విధంగా ప్లాన్ చేసి ఉంటుంది మోనిత. ఎందుకంటే తను కొడుకు ఆనంద్ కోసం హైదరాబాద్ వెళ్లాలంటే దీప కార్తీక్‌ని కలవకూడదు. అలా కలవకుండా ఉండాలంటే మోనిత ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఆ ప్లాన్ లో భాగంగా మోనిత ఈ ఇద్దరు ఆడవాళ్ళను రంగంలోకి దింపింది. ఒక రకంగా చూస్తే ఇది మోనిత స్కెచ్చే అని అనిపిస్తుంది. ఇదే నిజమైతే దీప మళ్లీ ఇరకాటంలో పడినట్టే. 150 కిలో మీటర్లు అంటే వెళ్లి రావడానికి రోజంతా సమయం పడుతుంది. కాబట్టి మోనితే ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు.

Exit mobile version