Site icon Prime9

Marina And Rohit: బిగ్ బాస్ ఇంట్లోకి రోహిత్, మెరీనా జంట

Bigboss Season 6: బిగ్ బాస్ సీజన్ 6 నుంచి మీరందరు షాక్ అయ్యే అప్డేట్ ఒకటి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 3 సీజన్‌లో వరుణ్ సందేశ్, వితిక కపుల్ ఎలా సందడి చేసారో అలాగే బిగ్ బాస్ సీజన్ 6 సీజన్‌లో కూడా ఒక కలర్ ఫుల్ కపుల్‌ని కంటెస్టెంట్స్‌ వస్తున్నారంటూ సమాచారం. మనకి ఈ కపుల్ సీరియల్ నటులుగా మన అందరికీ పరిచయం. ఈ రియల్ కపుల్ మెరీనా-రోహిత్ జంటగా బిగ్ బాస్ సీజన్ 6 హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 3లో వరుణ్ సందేశ్, వితికా షెరుల జంట బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టి చివరికి వరకూ కంటెస్టెంట్స్‌కి గట్టిపోటీ ఇచ్చారు. వితికాకు కాస్త నెగిటివిటీ టాక్ వచ్చింది. వరుణ్ సందేశ్ మాత్రం క్లీన్ ఇమేజ్‌తో బయటకు వచ్చాడు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లి ఈ జంట ఎలాంటి గొడవలు పడకుండా వచ్చారంటే చాల గొప్పవిషయమే. అయితే ఈసారి యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా‌తో మంచి పేరు తెచ్చకున్న ఈ బుల్లితెర జంట రోహిత్ మెరీనాలను బిగ్ బాస్ లోకి అడుపెట్టనున్నారు.

మెరీనా అబ్రహాం గోవాలోని క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. పెళ్ళి ఐనా తరువాత హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. జీ తెలుగు ఛానల్‌లో ప్రసారం అయిన ‘అమెరికా అమ్మాయి’ తో పాపులర్ అయ్యింది మెరీనా. ఆ సీరియల్‌లో సమంతా కళ్యాణిగా నటించి ప్రేక్షకుల ఆదరణలను, మన్నలను పొందింది. ఆ తరువాత ఉయ్యాల జంపాలా అనే ఇంకో సీరియల్‌ చేసింది. సీరియల్‌తో పాటు చిన్న చిన్న సినిమాల్లో కూడా మెరీనా నటించింది. 2016లో రొమాన్స్ విత్ ఫైనాన్స్ సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగు లోనే కాకుండా హిందీలో కూడా మెరీనా నటించింది. సబ్ కా దిల్ ఖుష్ అనే హిందీ సినిమాలో మెరీనా నటించింది. 2017 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అవార్డును గెలుచుకుంది. 2017 నవంబర్‌లో మెరీనాతో నటించిన తన సహా నటుడు, మోడల్ అయిన రోహిత్ షహ్‌నీ వివాహం చేసుకుంది. రోహిత్ కూడా సీరియల్స్‌తో బాగానే పాపులర్ అయ్యాడు. నీలికలువలు, అభిలాష సీరియల్స్‌తో పాపులర్ అయ్యాడు రోహిత్. 2015లో చిరు గొడవలు అనే సినిమాతో తెలుగులో డెబ్యూ హీరోగా నటించాడు.

అయితే ఈ జంట చాలామందికి కొత్త ముఖాలుగా అనిపించినా, టీవీ చూసేవారికి మాత్రం పాత జంట అన్నట్లే కనిపిస్తారు. యూట్యూబ్‌ వీడియాలతో కూడా ఈ జంట బాగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 6లో గట్టి పోటీ ఇస్తారనడంలో ఎలాంటి సందేహలు లేవు. అయితే ఎలాంటి గొడవలు లేకుండా వాళ్ల వ్యక్తిగత జీవితాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా బిగ్ బాస్ హౌస్‌ నుంచి మంచి ఇమేజ్‌తో బయటకురావాలనే మనమందరం కోరుకుందాం.

Exit mobile version