Site icon Prime9

Karthika Deepam: సెప్టెంబర్ 27 ఏపిసోడులో మోనిత నటనకు అవార్డు ఇచ్చిన తప్పులేదు?

karthika deepam 27 prime9news

karthika deepam 27 prime9news

Karthika Deepam Today: నేటి కార్తీకదీపం సీరియల్ ఏపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. శౌర్య ఏడుస్తూ ‘అసలు అమ్మా నాన్నలు చూడకుండా ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తానని అసల అనుకోలేదు అని అంటుంది. అప్పుడు మోనిత ‘వెళ్లాలి శౌర్యా, తప్పదు. మనకి బాధగా ఉన్నా కొన్ని నిజాలు నమ్మాలి. మరి నేను ఎందుకు ఇక్కడ ఉన్నా అని అనుమానం నీకు రావచ్చు. కానీ నేను అక్కడే ఉంటే మీతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి మనసు పాడవుతుంది. అందుకే మీ అమ్మా నాన్నలు పోయిన ఈ చోటే చిన్న బట్టల కొట్టు పెట్టుకుని నా జీవనం కొనసాగిస్తున్నానని చెబుతుంది.

మోనిత నటనకు అవార్డు ఇచ్చిన తప్పులేదు

ఇంతలో శౌర్య బాధని తట్టుకోలేక కింద పడి ఏడుస్తుంటుంది. శౌర్య బాధని చూడలేక మోనిత కూడా పక్కనే కూర్చుని, ‘ఏడవొద్దు శౌర్యా, నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఏడవకు, నేను కూడా నీలాగే కోరుకున్నా వాళ్లు బతికి ఉంటే బాగుండని, ఇప్పటికి వాళ్ళు బతికే ఉన్నారనే అనుకుంటున్నా కానీ నిజం తెలిసిన తరువాత కూడా ఎంత కాలం అని ఆ భ్రమలో ఉంటాం చెప్పు అని అడుగుతూ శౌర్యని ఓదార్చుతూ, ఇప్పుడు నీ కోసం వాళ్ళు బ్రతికే ఉన్నారని చెప్పచ్చు. కానీ అలా నీకు లేని పోనీ ఆశలు పెట్టడం కరెక్ట్ కాదుగా, శౌర్య ఆ ఆశతో నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళని వెతుక్కుంటూ ఉండిపోతావ్, ఐనా కూడా ఏమి ప్రయోజనం ఉండదు అందుకే నీకు బాధ కలిగించిన నేను నిజమే చెబుతున్నా. నువ్వు మీ నాన్నమ్మా తాతయ్యల దగ్గర ఉంటావ్ కదా అని’ దొంగ ఏడుపులు ఏడుస్తుంది మోనిత.

ఇదీ చదవండి : సెప్టెంబర్ 27 ఏపిసోడులో వసుని తిట్టిన జగతి మేడమ్ !

ఇదీ  చదవండి: సెప్టెంబర్ 27 ఏపిసోడులో.. మీకు దమ్ముంటే మీ వాడు చేసిన తప్పేంటో చెప్పమని అడిగిన అభి !

Exit mobile version