Site icon Prime9

Karthika Deepam : అక్టోబర్ 04 ఎపిసోడ్ లో ” గుర్తొస్తుంది మోనితా.. కానీ దానిలో నువ్వు లేవంటున్నా” కార్తీక్

karthika-deepam 04 oct prime9news

karthika-deepam 04 oct prime9news

Karthika Deepam : నేటి కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్

మోనిత కథను అల్లినట్టు ఎవరు అంత తొందరగా అల్లరేమో

ఉదయాన్నే దీప లేచి..తలస్నానం చేసి.. తలకు కొప్పు చుట్టుకుని..తులసి చెట్టుకు పూజలు చేస్తుంది.అప్పుడే అక్కడికి వచ్చిన దుర్గ ‘మనం ఇవ్వబోయే షాక్‌కి ఆ మోనితకి.. చిన్న జలక్ ఇచ్చి వస్తాను దీపమ్మా’ అంటూ మోనిత ఇంటికి వెళతాడు.ఇంతలో కార్తీక్ తల పట్టుకుని సోఫాలో కూర్చొని ఉంటే…మోనిత వేడి వేడి పకోడి తెచ్చి..కార్తీక్ కు ఇస్తుంది.‘వర్షంలో ఈ వేడి వేడి పకోడీ.. సూపర్ మోనితా’ అని కార్తీక్ నవ్వుతూ..వాటిని తీసుకొని తింటూ ఉంటాడు.‘అప్పుడు కూడా అంతే కార్తీక్.. వర్షం వస్తే.. మన ఊరిలో సామ్రాజ్యం అని ఒకావిడ దగ్గర వర్షంలోనే సైకిల్ మీద మనిద్దరం వెళ్ళి తినే వాళ్ళం అని ఒక్క క్షణంలో మోనిత అబద్దాన్ని ఒక రేంజులో అల్లేస్తుంది.

గుర్తొస్తుంది మోనితా.. కానీ దానిలో నువ్వు లేవంటున్నా కార్తీక్

అదే సమయంలో కార్తీక్‌కి.. దీప, పిల్లలతో ఆస్తిని వదిలి వెళ్లిన తర్వాత ఓ పల్లెటూరులో సైకిల్ మీద తిరిగిన కొన్ని సీన్స్ గుర్తొస్తాయి.‘గుర్తొస్తుంది మోనితా.. కానీ దానిలో నువ్వు లేవు.. నేను ఒక్కడ్నే సైకిల్ మీద వెళ్తునన్నట్టు గుర్తు వచ్చింది..ఐనా నువ్వు చెప్పే వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా సింక్ అవ్వడం లేదేంటి మోనితా.. నువ్వు అసల లేనే లేవు’ అని కార్తీక్ బలంగా అంటాడు.‘అది బలవంతంగా నువ్వు గుర్తు చేసుకునే ప్రయత్నం చేయొద్దుని డాక్టర్లు చెప్పారు కదా’ అంటూ మళ్ళీ ఇంకో కథను అల్లేస్తుంది.ఇంతలో దుర్గ మోనిత ఇంటికి వస్తాడు. ఇద్దరికీ హాయ్ చెప్పి సోఫాలో కూర్చుంటాడు ‘ఏంటి సార్ మీరు తినేది పకోడీనా’ అంటూ తను కూడా తీసుకొని తింటాడు.

ఇదీ  చదవండి :Karthika Deepam : అక్టోబర్ 03 ఎ పిసోడ్ లో అడ్డంగా దొరికిపోయిన మోనిత

Exit mobile version