Site icon Prime9

Karthika Deepam: సెప్టెంబర్ 24 ఏపిసోడులో కొత్త కథను అల్లిన మోనిత!

karthika-deepam 24 prime9news.jpg

karthika-deepam 24 prime9news.jpg

Karthika Deepam Today: నేటి ఏపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్, శివ మోనిత దగ్గరకు వచ్చి, ‘మేడమ్ ఇందాక వచ్చినవాళ్లు నిజంగా సార్ వాళ్ల అమ్మా నాన్నలేనా? మీరు వంటలక్కతో చెబుతుంటే విన్నానని అంటాడు. అప్పుడు మోనిత కోపంగా చూస్తూ ఏమి అనలేక సైలెంటు అవుతుంది. ఇంతలో ‘హా, ఎవరైతే నాకెందుకు అండి ’ అంటూ మాట వెంటనే మార్చేస్తాడు శివ. కొంతసేపటికి ఇంతలో కార్తీక్ వచ్చి, ‘వచ్చిన వాళ్లు ఎవరు మోనితా?’ అనగానే, ‘శివా వాళ్ల అమ్మానాన్నలు కార్తీక్’ అని మళ్ళీ కొత్త కధను అల్లుతుంది మోనిత. ఆ మాటకు వేడివేడి పాలు తాగుతున్న శివకు ఒక్కసారిగా షాక్ అయి మూతి కాల్చుకుంటాడు. శివ నోరెళ్లబెట్టి మోనిత వైపు చూస్తూ ఉంటాడు. మరి ‘అదేంటి శివని కలవకుండా వెళ్లిపోయాయారు అని అంటాడు కార్తీక్.

కార్తీక్, దీప గురించి ఆలోచిస్తున్న సమయంలో మోనిత వచ్చి అక్కడికి వచ్చి ‘నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావ్ కార్తీక్, ఐనా నేను ఇక్కడే ఉన్నాగా ఇంకెవరి గురించి ఆలోచిస్తున్నావ్, అసలు మనం ఈ ఊరు వదిలి వెళ్లిపోదాం’ అంటూ అని కార్తీక్ కు చెబుతుంది. ‘మనం ఏం తప్పు చేశాం మోనితా. ఇక్కడ నుంచి వెళ్లిపోవడానికి అలా వెళ్తే మనం ఏదో తప్పుచేసి వెళ్లిపోయినట్లే అనుకుంటారు. ఆవిడ నిజంగానే నా భార్య., నేను ఆమెను వదిలించుకోవడానికి వెళ్లిపోయాడు అనుకుంటారు. అలా జరక్కూడదంటే, మనం ఇక్కడే ఉండాలి. కొంత సేపటికి కార్తీక్ దీప దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చి, ‘ఇవి తీసుకోండి. మీ దగ్గర ఉంచుకోండి. మీకు కావాలంటే ఇంకా డబ్బులు ఇస్తాను. కానీ మీరు నాకు ఒక సహాయం చేయాలని అడుగుతాడు. మీరు నన్ను వదిలేయాలి. అలాగే మీరు నా జోలికి రావద్దు. నాకు బాగా గుర్తుండేది ఓకె ఒక్కటి. మోనిత నా భార్య. ఆనంద్ నా కొడుకు. ఆ ఎదురు ఇంట్లోనే మేము ఉంటాం. కాబట్టి మీరు మాత్రం మా జోలికి రావడానికి వీల్లేదు’ అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇది అంతా చాటుగా మోనిత విని తెగ మురిసిపోతుంది.

Exit mobile version
Skip to toolbar