Site icon Prime9

Karthika Deepam: సెప్టెంబర్ 26 ఏపిసోడులో దీపతో బయటకు వెళ్ళిన కార్తీక్

karthika-deepam 26 prime9news

karthika-deepam 26 prime9news

Karthika Deepam Today: నేటి కార్తీక దీపం సీరియల్ ఏపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. మోనిత ఎవరికి తెలియకుండా ఒక డాక్టర్‌ని కలుస్తుంది. నేనూ డాక్టర్‌నే అని మోనిత డాక్టర్కు చెబుతుంది. కానీ ఇక్కడ స్పెషలిస్ట్‌తో మాట్లాడాలని ఈ హాస్పిటల్ కు వచ్చానని డాక్టర్ కు చెబుతుంది. డాక్టర్ గారు మీ నుంచి నాకు ఒక సలహా కావాలి. కాకపోతే నేను పేషెంట్‌ని ఇక్కడికి తీసుకురాలేదని చెబుతుంది. ఇక అసలు విషయానికొస్తే నాకు తెలిసిన ఒకావిడ భర్త గతం మరిచిపోయాడని, ఆమె గతం గుర్తు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తోందని, ఆమె ఫంక్షన్స్ కు వంటలు చేసి పెడుతుందని,  ఇలా పూస గుచ్చినట్టు మొత్తం డాక్టర్ గారికి వివరిస్తుంది. దీని వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందంటారా? అని మోనిత డాక్టర్ గారిని అడుగుతుంది. మీ బాధ నాకు అర్దం అయింది. మీకు మంచి ఉదాహరణ చెప్తా వినండి ఒక డాన్సర్ గతాన్ని మరిచిపోయాడు. కానీ అతని కూతురు మాత్రం అతను వేసిన డాన్స్‌నే రోజు అతనికి చూపించేది. ఇలా ఒక ఒకరోజు అతనికి గతం గుర్తొచ్చి అతని కూతురితో కలసి డాన్స్ వేశాడు. అలాంటి క్రమంలోనే మీరు చెప్పిన దాన్ని చూసుకుంటే గతం గుర్తొచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని డాక్టర్ మోనితకి అర్దం అయ్యేలా చెబుతారు. ఈ మాట విన్నాక మోనితకి ఒక్క దెబ్బకి ఫ్యూజులు అవుట్ అవుతాయి.

దీపతో బయటకు వెళ్ళిన కార్తీక్..

దీప, కార్తీక్ దగ్గరికి వచ్చి “నేను ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకొచ్చానంటే, మీరు నాతో బయటికి రావాలి డాక్టర్ బాబు అని అడగగా, మన కాలనీ వాళ్ళు సొసైటీ హాల్లో నాటకం వేస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళాలి అని చెబుతుంది. అప్పుడు కార్తీక్ ‘నువ్వు నాటకం చూడటానికి వెళ్తే నేనెందుకు నీతో రావాలి? నీ భర్త ఎవరు? ఎక్కడుంటాడని అందరు అడుగుతారని అంటాడు కార్తీక్. డాక్టర్ బాబు ఈ ‘నాటకం చూస్తే మీకే తెలుస్తుందని అంటుంది దీప. ‘అయితే సరే పదా నేను వస్తానని అంటాడు కార్తీక్, అప్పుడు శివ ‘సార్ మేడమ్ తిడతారేమో అని అంటాడు. కదా ఐతే చెప్పమాకు సొసైటీ హాల్‌లో నాటకం వేస్తుంటే చూడటానికి వెళ్తున్నా అని చెప్పు చాలని అంటాడు కార్తీక్. మొత్తానికి దీపతో పాటు కార్తీక్ నాటకం చూడాటానికి వెళతాడు. తరువాత ఏమి జరుగుతుందో రేపటి ఏపిసోడులో తెలుసుకుందాం.

ఇదీ  చదవండి : సెప్టెంబర్ 26 ఏపిసోడులో వసు కోసం పూలు కొన్న రిషి

Exit mobile version