Karthika Deepam: అక్టోబర్ 12 ఎపిసోడ్ లో మోనిత వేషాలు మాములుగుగా లేవుగా..

టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం’. అక్టోబర్ 12 ఎపిసోడ్‌ హైలైట్స్ చూద్దాం.

  • Written By:
  • Publish Date - October 12, 2022 / 11:34 AM IST

Karthika Deepam Today: నేటి  కార్తీక దీపం  సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. నేటి ఎపిసోడ్ లో దీప, బతుకమ్మను కాలువలో వదిలేందుకు ఊరివారితో కలిసి అక్కడికి వెళ్తుంది. ‘నా భర్త నా దగ్గరకు వచ్చేలా చేయి తల్లీ’ అంటూ అమ్మవారికి మొక్కి, బతుకమ్మని చెరువులో వదులుతుంది. ఆ తర్వాత ‘డాక్టర్ బాబు చాలా సేపటి నుంచి కనిపించడం లేదమ్మా, ఈ మోనితది ఏమైనా చేసి ఉంటుందా అని, లేకపోతే ఊరిలో లేకుండా దూరంగా పంపించేసిందా అంటూ తన అమ్మతో చెప్పి దీప కంగారు పడుతుంది. దాంతో ఆమె దీపకు ధైర్యం చెబుతుంది. ‘ఆ మోనితకు అంత సీన్ లేదులే, అది ఏం చెయ్యలేదు. లేనిపోని భయాలేమి పెట్టుకోకు, ఆ భగవంతుడి దయవల్ల నీ భర్త నిజం తెలుసుకొని నీ దగ్గరకు వస్తాదంటూ దీపకు సర్థిచెబుతుంది.

మోనిత వేషాలు మామూలుగా లేవుగా..

మోనిత రౌడీలతో ఫోన్ మాట్లాడి పెట్టేయగానే, ఎదురుగా కొంచెం దూరంలో ఉన్న కార్తీక్‌ని వెతుకుతున్న దీపని చూసిన మోనిత. ‘ఇంక నువ్వు బతికేది కొద్ది క్షణాలే, వాళ్లు వచ్చి నీ ప్రాణాలు తీస్తారు. ఆ సమయంలో నేను కార్తీక్ పక్కనే ఉంటాను. కాబట్టి  నీ చావుకు నాకు ఏ సంబంధం ఉండదని కార్తీక్ బలంగా నమ్ముతాడు. మరి నీకు ఏమైంది అంటే, నీ భర్త వదిలేశాడని ఇక్కడో ఒక కథ పుట్టించాను కదా. వాడే వచ్చి నిన్ను చంపేశాడాని ఇంకో కథ పుట్టిస్తాను. హే దీప ఈ రోజుతో నీ చరిత్ర సమాప్తం’ అంటూ తెగ సంబరపడుతుంది మోనిత. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.