Site icon Prime9

Karthika Deepam: అక్టోబర్ 13 ఎపిసోడ్ లో ఒక్క రాయి దెబ్బకు కార్తీక్ బాబు.. డాక్టర్ బాబు ఐపోయాడు!

karthika deepam 13 oct prime9news

karthika deepam 13 oct prime9news

Karthika Deepam Today: నేటి కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీనులు హైలెట్. డాక్టర్ బాబుకు ఏమైంది దీపక్క అని వారణాసి అనుమానంగా అడుగుతాడు. అప్పుడు వెంటనే పైకి లేచిన కార్తీక్ దీప,  దీప అంటే వంటలక్కే కదా? అని కంగారుగా పిలుస్తాడు. ‘అవును డాక్టర్ బాబు తను బతికే ఉందా’ అని అంటాడు వారణాసి. ఆమె ‘ఇ..ఇక్కడే ఉంది’ అని కార్తీక్ అంటాడు. ‘ఎక్కడుంది డాక్టర్ బాబు ఎక్కడుంది?’ అని ఏడుస్తూ వారణాసి అంటాడు. ఇంతలో దీప కార్తీక్‌ని వెతుక్కుంటూ మోనిత మాట నమ్మి, అటు వైపుగా వెళ్తుంది. రౌడీలు దీప వస్తే దీపను చంపేద్దామని దీప కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ‘దీపక్క ఎక్కడుందో అని చెప్పండి డాక్టర్ బాబు’ అని గట్టిగా అరిచి చెప్తాడు.

ఇంతలో మోనిత, సౌర్యలు రోడ్డుకు ఆనుకుని ఉన్న జాతరలో ఎదురెదురుగా వస్తుంటారు. మోనితని చూసిన సౌర్య, అక్కడే ఉన్న పెద్ద రాయి అందుకుని, ‘నన్నే తిడతావా?’ అనుకుంటూ పెద్ద రాయి తీసుకొని మోనిత వైపుకి విసురుతుంది. సరిగ్గా రాయి తన మీదకు వస్తున్నప్పుడు మోనిత, పక్కకు తప్పుకుంటుంది. ఆ రాయి వెళ్లి అటు పక్కకు కూర్చుని ఉన్న వారణాసి లేపుతున్న కార్తీక్ తలకు బలంగా తగులుతుంది. వెంటనే గతం తాలూక అన్నీ గుర్తులన్నీ గుర్తొస్తాయి. కార్తీక్ తలపట్టుకుని కూర్చొంటాడు. ‘హేయ్ సౌర్య నన్నే కొడతావా ఆగవే’ అంటూ మోనిత సౌర్య వెనుక పరిగెడుతుంది. సౌర్య అక్కడ నుంచి మోనితకి దొరక్కుండా పారిపోతుంది.

Exit mobile version