Site icon Prime9

Karthika Deepam: అక్టోబర్ 08 ఎపిసోడ్ ” నువ్వు నా భర్తని ఎక్కడికెళ్లినా వదిలిపెట్టవా ” అంటున్న దీప

karthika-deepam 08 oct prime9news

karthika-deepam 08 oct prime9news

Karthika Deepam: నేటి కార్తీకదీపం సీరియల్ ఎపిసోడులో ఈ సీను హైలెట్

కార్తీకదీపం సీరియల్లో దుర్గ ఎంట్రీ ఓ వైపు..ఐతే కార్తీక్‌కి గుర్తొచ్చే సన్నివేశాలు ఇంకోవైపు.. కార్తీక్ మోనిత చెప్పే ప్రతిదాన్ని నిలదీస్తూనే ఉన్నాడు.ఈ క్రమంలోనే సంగారెడ్డి దసరా ఉత్సవాలకు ఇటు..మోనిత, కార్తీక్‌.. అటు దీప, దీప వాళ్ల అన్నయ్యా, వాళ్ల అమ్మలతో పాటు..సౌర్య, ఇంద్రుడు,చంద్రమ్మలు రావడంతో సీరియల్ కు మంచి హైపు వచ్చింది.ఓ వైపు గతంలో మోనిత ‘కార్తీక్ ఇదే నీ ఊరు.. వీళ్లే నీ మనుషులు’ అని కార్తీక్ ను నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ కని కార్తీక్ నమ్మడు.ఊరు సంగారెడ్డే అని..అదే ఊరిలో దసరా ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి అంటూ మోనిత కార్తీక్‌ని మభ్యపెడుతుంటే..దీప వాళ్ల అన్నయ్య, ‘అదే ఊరిలో పెద్ద మనిషి రాజ్యలక్ష్మీ మా బంధువే..ఆమెకు చెప్పి.. మోనితకు మంచిగా బుద్ది చెబుదాం అని అనడంతో దీపకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది.

కొంతసేపటికి దీప రెడీ అయ్యి జాతరలో కార్తీక్‌ని వెతుకుతూ ఉంటుంది.చివరికి మోనిత,కార్తీక్ ఓ చోట కనిపిస్తారు.దీప అక్కడికి వచ్చి ‘డాక్టర్ బాబు మీకోసమే వెతుకుతున్నా’ అని దీప అనేలోపు..మోనిత ఏడుపు మొదలుపెట్టేసి..‘నువ్వు నా భర్తని ఎక్కడికెళ్లినా వదిలిపెట్టవా’ అంటూ దీపను ఆడిపోసుకుంటుంది.అదే సమయానికి కావేరీ..ఇద్దరు ఆడవాళ్లని కార్తీక్ వాళ్ల దగ్గరకు కావాలనే పంపించి..‘ఈ వంటలక్క మిమ్మల్ని ఇంకా వదల్లేదా అని అంటుంటారు.ఇక మళ్లీ కార్తీక్‌కి దీప మీద నమ్మకంపోయేలా చేసి..మోనిత కార్తీక్ ను లాక్కునిపోతుంది.తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడులో తెలుసుకుందాం.

ఇది చదవండి :GruhaLakshmi: అక్టోబర్ 07 ఎపిసోడులో తులసి ఇంటికి వెళ్ళినా సామ్రాట్

Exit mobile version