Site icon Prime9

Karthika Deepam: అక్టోబర్18 ఎపిసోడ్ లో మోనిత చెంప పగలకొట్టిన దీప

karthika deepam oct 18

karthika deepam oct 18

Karthika Deepam Today: నేటి కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. ‘ఎంత ధైర్యమే నీకు, నా మొగుడ్ని రాత్రంతా’ అంటూ ఏదో మాట్లాడబోతుంటే దీప మోనిత చెంప పగలగొడుతుంది. ‘నేనే లేచి బయటికి వచ్చేసరికే డాక్టర్ బాబు బయట కూర్చుని ఉన్నారు. అసలు నిజం తెలియకుండా ఏదీ వాగమాకని దీప కోపంగా మోనితతో అంటుంది. కార్తీక్ అక్కడే మంచం మీద కూర్చుని ఉంటాడు. మన హీరో గారు ఇటు దీప, అటు మోనిత మధ్యలో కూల్‌గా కాఫీ తాగుతుంటాడు. ‘నన్నే కొడతావా? నువ్వేంటి కార్తీక్ అలా కూర్చుని చూస్తూ ఉంటావ్, నీ భార్యని కొడితే పట్టించుకోవా?’అని మోనిత కోపంగా అంటుంది. వెంటనే పైకి లేచి, గ్లాస్ పక్కన పెట్టి, ‘భార్యా ఎవరు నా భార్యా? నువ్వా? లేక వంటలక్కా?’ అంటూ కార్తీక్ చాలా అమాయకంగా ముఖం పెడుతూ ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు.

నువ్వు ఏదైతే అనుకున్నావో అదే జరిగింది కదా అని కార్తీక్ మోనితాతో అంటాడు. మోనిత బిత్తరపోయి చూస్తుంది. ‘ఎక్కువ ఆలోచించకు అదే జరిగింది. పదా’ అంటాడు కార్తీక్. ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఇంటికి వస్తారు. మోనిత కూర్చీలో కూర్చుని, రగిలిపోతూ చెంప పట్టుకుని, రుద్దుకుంటూ ‘నన్నే కొడతావా వంటలక్కా’ నీ అంతూ చూస్తా అంటూ రగిలిపోతుంది. అది చూసిన కార్తీక్, కావాలనే‘ ఏం జరిగింది అలా చెంప రుద్దుకుంటున్నావ్’ అని అడగుతాడు ‘మరిచిపోయావా? అప్పుడే మరిచిపోయావా? లేదంటే కావాలనే ఇలా అడిగి ఇబ్బంది పెడుతున్నావా. నాకు ఇలా జరగాల్సిందే. రాత్రంతా నువ్వు ఇంటికి రాలేదని, నీ కోసం తిండి కూడా తినకుండా ఎదురు చూస్తూ అలానే ఉండిపోయా ఇలానే మాట్లాడు నువ్వు’ అంటుంది మోనిత అంటుంది.

Exit mobile version