Site icon Prime9

Karthika Deepam: సెప్టెంబర్ 30 ఏపిసోడులో మోనిత జీవితంలోకి అడుగుపెట్టనున్న దుర్గా?

karthika-deepam 30 prime9news

karthika-deepam 30 prime9news

Karthika Deepam Today: నేటి కార్తీకదీపం సీరియల్ ఏపిసోడులో ఈ సీను హైలెట్. కార్తీక్ గతం గుర్తు చేయడానికి కార్తీకదీపం డ్రామా పేరుతో దీప పాపం చాలా కష్టపడింది. ఐతే కళ్లుతిరిగి పడిపోయిన కార్తీక్‌ని హాస్పిటల్ తీసుకుని వెళ్తే, మోనిత కార్తీక్ ను కనుక్కొని ఎక్కడున్నాడో కనుక్కుని హాస్పిటల్ వెళ్తుంది. కార్తీక్‌కి మెలుకవ వచ్చి, దీప అని పిలుస్తాడని ఆశ పడింది. కానీ దీప ఆశలు అడియశలు అయ్యాయి. కార్తీక్ మోనిత అని పిలవడంతో మోనిత కార్తీక్ ను తీసుకుని వెళ్లిపోయిన కథను నిన్నటి ఏపిసోడులో చూశాం.

కార్తీక్ నిద్రపోతూ ఉండగా, మోనిత తనలో తనే తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఆ దుర్గా గాడు మళ్లీ నా జీవితంలోకి రావాలనుకుంటున్నాడు. అసలు వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు. కార్తీక్ నా దగ్గర ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదని నేను అనుకుంటుంటే ఆ దీప ఇంటి ముందే ఇల్లు తీసుకుంది. మొన్నటికి మొన్న సౌందర్య ఆంటీ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళింది. ఇందాక ఏమో సౌర్య వచ్చింది. ఇప్పుడు వీడు వచ్చాడు. అసలు వీళ్ళు కావాలనే నా లైఫ్ లోకి వస్తున్నారా? కావాలని ఇదంతా చేస్తున్నారా? వీరందరూ కలిసి నా మీద కుట్ర చేస్తున్నారా? ఏదైతే ఏంటీ? అసలు వీళ్ళకి నేనెందుకు భయపడాలి? కార్తీక్‌కి గతం గుర్తొచ్చినప్పుడు కదా, నేను భయపడేది. అది ఎప్పటికీ జరగదు. కార్తీక్కు ఈ మోనితే గుర్తు ఉండాలి తుది శ్వాస విడిచే వరకూ ఈ మోనితనే కలవరించాలి. అలాగే కలవరిస్తాడు కూడా అని తనలో తనే అనుకుంటూ ఉండగా పక్క రూమ్‌లో పడుకున్న కార్తీక్. దీప దీప అని కలవరిస్తూ ఉంటాడు. తరువాత ఎం జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుసుకుందాం.

ఇదీ  చదవండి : సెప్టెంబర్ 29 ఏపిసోడులో మోనిత అల్లిన కథకు అవార్డు ఇచ్చిన తప్పులేదు!

Exit mobile version