Site icon Prime9

Karthika Deepam: నవంబర్ 05 ఎపిసోడ్ లో మోనితను ఆడుకున్న దుర్గ

karthika deepam Nov 05 prime9news

karthika deepam Nov 05 prime9news

Karthika Deepam:  నేటి కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్

తాతయ్యా…మా పిన్నీ బాబాయ్‌లని ఏం అనొద్దు.వాళ్లు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో మీకు తెలియదని సౌర్య అంటుంది. ‘తెలుసు..అదే నా భయం కూడా…ప్రాణంగా చూసుకుంటున్నారనే నాకు భయంగా ఉంది.తను ఇళ్లు మారతాను అన్న ప్రతిసారీ అదే పనిగా మారుస్తున్నారు…ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి…నా మనవరాల్ని మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా మా నుంచి దూరం చెయ్యలేరని ఆనందరావు కోపంగా అంటాడు.‘తాతయ్యా…వాళ్లకి అలాంటి ఉద్దేశాలేం లేవు…అమ్మానాన్నలని వెతకడానికి ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసా..? వీలైతే వాళ్ళకి థాంక్స్ చెప్పండి’ అని సౌర్య అంటుంది.‘బాధ్యతకి ఆశకి తేడా తెలియని వాడు కాదమ్మా మీ తాతయ్యా…చూడు మా మనవరాలు మాతో వచ్చే వరకూ మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు…ఖర్చులకు ఉంచు’ అంటూకొంత డబ్బును కట్ట ఇంద్రుడు చేతిలో పెడతాడు ఆనందరావు.

మోనిత అదే ఆవేశంలో ఇంటికి వచ్చేస్తుంది.కార్తీక్ సౌర్య కోసం ఆలోచిస్తూ ఉంటాడు.కార్తీక్ ను మోనిత వెళ్లి పలకరిస్తుంది.నా మీద నీకు అనుమానం ఏంటీ కార్తీక్ అంటూ ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది.ఇంతలో దుర్గ వచ్చి..‘మోనితా నీ కోసమే…నువ్వు అడిగావనే.. నేను ఊరంతా తిరిగి హైదరాబాద్ బిర్యానీ తెచ్చాను తిను అంటూ కార్తీక్ దగ్గర మోనితను ఇరికిస్తాడు.కార్తీక్ దొరికిందే ఛాన్స్ అని..మోనితని కోపంగా మాటలు అనేసి…అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తరువాత  ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Exit mobile version