Site icon Prime9

Karthika Deepam: సెప్టెంబర్ 22 ఏపిసోడులో కన్నీరు తెప్పించిన దీప

karthika deepam 22 prime9news

karthika deepam 22 prime9news

Karthika Deepam: నేటి కార్తీకదీపం సీరియల్లో ఈ రెండు సీనులు హైలెట్. ‘హేయ్, ఏం మాట్లాడుతున్నారు మీరందరూ అని దీప కోపంగా అంటుంది. ‘అయ్యో నీ చరిత్ర మాకు ఎవరికి తెలియదనుకుంటున్నవా, మీ వాళ్ళు ఊరు విడిచిపెట్టి వెళ్ళినా, నువ్వు ఎందుకు వెళ్లలేదు.  అయినా నీ మొగుడు నిన్ను వదిలేసి పోయాడుగా’ అంటూ ఎవరి ఇస్టం వచ్చినట్టు వారు దీపను ఆ ఊరి జనం అవమానిస్తారు. ఆ మాటలు విన్న దీప ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మోనిత నవ్వుకుంటుంది. అవి అన్నీ చూస్తున్న కార్తీక్ ఇదంతా నిజమే అన్నట్లుగా చూస్తూ ఉంటాడు. ‘ఇదిగో కార్తీక్ బాబు, దీని మొగుడు ఒక డాక్టర్, ఆయన ఇంటింటికీ తిరిగి వైద్యం చేసేవాడు. అప్పట్లో ఇది వంటలు బాగా చేసేది. మీ ఇంట్లో వంట చేసేది. ఈమె మీద మనసు పడి,పెళ్లి చేసుకున్నాడు. భర్త అంటే కార్తీక్ బాబులా ఉండాలి అంటూ దీప మొగుడ్ని ఊరి జనం అవమానించారు. ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వారు అంటూ కట్టకథలు అల్లి చెబుతారు.

కన్నీరు తెప్పించిన దీప..

‘ఏంటి ఈ వంటలక్క ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. మీరు తీసుకొచ్చారా లేక మీ వెంటపడుతుందా అని ఊరి జనం అంటుంటారు. ‘శనిని ఎవరైనా వెంటపెట్టుకుని వస్తారా కావేరీ అమ్మా. ఆవిడే మా వెంట పడుతుందని ఆ ఊరిలో జనంలో ఒకావిడ అంటుంది. ‘నీకు సిగ్గులేదా? నువ్వు ఇంకా మారలేదా?’ అంటూ తిడుతూనే ఉంటుంది కావేరి. ‘చాల్లే కావేరి ఇంక వదిలెయ్. ఇప్పటికే డోస్ బాగా ఎక్కువైంది. పదా ఇక వెళ్దాం అని అంటుంది. అప్పుడు మోనిత దీప వైపు చూస్తూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ దీప మాత్రం ఆ మాటలకు కుమిలిపోతుంది. ‘ఇదంతా చూస్తుంటే నిజమే అని అనిపిస్తోంది. ఇక గతం మరిచిపోయిన నమ్మడంలో గొప్పేముంది’ అంటూ ఏడుస్తుందుంటుంది వంటలక్క. రేపు ఏమి జరగనుందో వివరాలు తరువాతి ఏపిసోడులో తెలుకుందాం.

Exit mobile version