Site icon Prime9

Guppedantha Manasu: అక్టోబర్ 19 ఎపిసోడ్ లో దేవయానిని ఒక ఆట ఆడుకున్న వసుధార

guppedantha manasu serial 19 Oct prime9news

guppedantha manasu serial 19 Oct prime9news

Guppedantha Manasu: నేటి  గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్

“పెద్దమ్మా మీరు ఈ విషయంలో ఎందుకు ఇబ్బందిపడుతున్నారు..? మనసు తెలుసుకోవాల్సిన వారు తెలుసుకోవడం లేదు పెద్దమ్మా.. ఏదైనా వాళ్ళ నుంచే రావాలి..మనం బలవంతంగా వాళ్ళ అభిప్రాయాలు మార్చలేం పెద్దమ్మా.. అలా ఒకవేళ మారినా అది తాత్కాలికంగా మాత్రమే అవుతుందని”రిషి అంటాడు. ‘నిజమే సార్.. మీరు చాలా కరెక్టుగా చెప్పారు..విన్నారు కదా మేడమ్?. సార్‌కి నాకు చిన్న అడ్డుతెర మాత్రమే ఉంది..ఈ ఒక్క విషయంలో తప్పితే మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది మేడమ్.. మీరు జోక్యం చేసుకుని ఇంక కష్టపడకండి మేడమ్.. జరగాల్సినవన్నీ ఎలాగో జరిగిపోతాయి..మాకోసం మీరు ఆలోచిస్తున్నందుకు మీకు చాలా థాంక్సూ మేడమ్..మీలాంటి పెద్దవాళ్లు మేము ఒకటి కావాలని కోరుకుంటున్నారుగా అది తప్పకుండా జరుగుతుంది మేడమ్’అని వసు అంటుంది.

‘నేను చెప్పేది కూడా రమ్మనే కదా? మరి నువ్వేంటీ నా మాట వింటున్నట్టే ఉంటావు కానీ తెలివిగా మాట్లాడుతావ్ అని దేవయాని కోపంగా అంటుంది.‘నాకు తెలివి ఎక్కువని మీరే కదా మేడమ్ అన్నారు’ అంటూ చిన్నగా వసు చురకలు అంటిస్తుంది.ఇంతలో వసు ఎదురింటి ఆవిడ..‘ఏంటమ్మా వసుధారా.. రోడ్డు మీద ఆగి మాట్లాడుకున్నారు ఏమైనా గొడవా’ అని అడుగుతుంది.‘అబ్బే లేదు ఆంటీ.. ఇది మా కుటుంబ వ్యవహారం’అంటూ దేవయానిని చూసి వసు పక పక నవ్వుతూ ఉంటుంది. దేవయాని రగిలిపోతుంది.వెంటనే రిషి..‘పెద్దమ్మా.. పదండి వెళ్దాం’ అంటూ దేవయాని చెప్పేది వినకుండా కారు ఎక్కించుకుంటాడు.దేవయాని కారు డ్రైవర్‌కి వెళ్లిపోమని చెప్పి.. దేవయానిని తన కారులో ఇంటికి తీసుకుని వెళ్తుంటాడు.తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

ఇదీ చదవండి : Karthika Deepam: అక్టోబర్19 ఎపిసోడ్ లో దీప కోసం ఇల్లు క్లీన్ చేస్తానంటున్న డాక్టర్ బాబు

ఇదీ చదవండి :Gruhalakshmi: అక్టోబర్ 19 ఎపిసోడ్ లో సామ్రాట్ బాస్ పరువు కాస్తా తుస్సు అయింది !

Exit mobile version