Site icon Prime9

Guppedantha Manasu: సెప్టెంబర్ 26 ఏపిసోడులో వసు కోసం పూలు కొన్న రిషి

guppedantha manasu serial 26 prime9news

guppedantha manasu serial 26 prime9news

Guppedantha Manasu Today: నేటి గుప్పెడంత మనసు సీరియల్ ఏపిసోడులో ఈ రెండు సీన్లు ఏడిపించేశాయి. నువ్వు, మన ప్రేమ ఒక అబద్దమని అన్న రిషి. ‘అసలు సాక్షీ ఎందుకంత సాహసం చేసింది. తన ఏమనుకుంటుందో నీకు ముందే తెలుసా ? మరి నువ్వు నాకెందుకు చెప్పలేదు? మన మధ్య దాపరికాలు లేని ప్రేమ ఉండాలనుకుంటున్నా. కానీ నువ్వు మాత్రం అలా ఉండటం లేదు. మన మధ్య నువ్వు ప్రతి విషయం ఇలా దాచేస్తే, మన ప్రేమ అబద్దమా? లేక అబద్దమని అనుకోవాలా తెలీడం లేదు. వసుధార నువ్వు అబద్దమా? లేక నేను అబద్దమా వసుధారా?’ అంటూ గట్టిగా అరుస్తాడు రిషి. ‘సార్ ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాలి ప్రేమ అంటేనే అన్నింటినీ ఓర్చుకోవడమే సార్, మీ మనసుకి కష్టం కలగకూడదని. మిమ్మలని ఇబ్బంది పెట్టలేక సాక్షీ విషయం మీ దగ్గర చెప్పలేదు సార్’ అంటుంది వసు. కానీ, నువ్వు ఎలా నిర్ణయిస్తావ్ వసుధారా? ఇప్పటివరకు చెప్పకుండా ఎందుకు దాచావ్. ఇక నిన్ను నేను ఎలా అర్థం చేసుకోవాలి చెప్పమని అంటాడు రిషి.

వసు కోసం పూలు కొన్న రిషి..

ఆ మాటలన్ని విన్న తరువాత వసు బాధగా అక్కడే ఉండిపోతుంది. రిషి హారన్ గట్టిగా కొడతాడు ఐనా వినిపించికోదు.రిషి వచ్చి కారు ఎక్కు అనగానే వసు వచ్చి కారు ఎక్కుతుంది. ఇక అప్పుడే ఒక ఆవిడ పూల అమ్ముతుండగా బాబు పూలు తీసుకోండి. ‘తీసుకోవచ్చుగా’ బాబు అని ఆవిడ రిషిని బలవంతం చేయగా మొత్తానికీ రిషీ పూలను ఆవిడ దగ్గర తీసుకుంటాడు. అప్పుడు రిషి వసు చేతిలో పెట్టి, ‘నువ్వు అనుకున్నది కాదు అన్నాను. ఏంటి సార్ అని వసు అడగగా, నువ్వు వచ్చేదారిలో ఎప్పుడూ ఈ రిషీంద్ర భూషణ్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు’ అంటూ గట్టి క్లారిటీ వసుకు ఇస్తాడు. హమ్మయ్య మా వసుధార మొత్తానికి నవ్వుతుంది. తరువాతా ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుకుందాం.

Exit mobile version