Site icon Prime9

Guppedantha Manasu: నవంబర్ 05 ఎపిసోడ్ లో మేడ పైన రిషి వసు రొమాంటిక్ సీన్

guppedantha manasu serial 05 nov prime9news

guppedantha manasu serial 05 nov prime9news

Guppedantha Manasu Today: నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. ఇక రిషి, వసులు మేడ మీద దీపాలు వెలిగించే ఒక  సీన్ కంటిన్యూ అవుతుంది. ‘వసుధారా నువ్వు నా జీవితాన్ని కూడా ఇలానే ప్రమిదలు వెలిగించినట్లు వెలిగించి ఒక వెలుగు చూపించావు. వసుని ఇలా మాటలతో తెగ పొగిడేస్తూ ఉంటాడు రిషి. వసు కళ్లు మూసుకుని గిర్రున తిరుగుతుంటే కాలు స్లిప్ అయ్యి  రిషి మీద పడిపోతుంది.

రిషి వసుని పట్టుకుంటాడు. వసు, రిషి మధ్య  ఒక రొమాంటిక్ ఫీలింగ్ నడుస్తుంటుంది. అలానే ఇద్దరూ మరింత దగ్గర అవుతారు. ఇక వసు కూల్‌గా కొంతసేపటికి కిందకు దిగుతుంది. అది  దేవయాని చూస్తుంది. చూసి రగిలపోతుంది. ‘ఎక్కడి నుంచి వస్తున్నావ్?’ అని వసుతో కోపంగా అంటుంది. ‘ఇంటి పైనుంచి మేడమ్’ మేడమ్ కావాలని అంటుంది వసు. ‘పైన రిషి కూడా ఉన్నాడు కదా’ అని దేవయాని అడుగుతుంది. ‘అవును మేడమ్’ అని వసు అంటుంది. ‘అసలు నువ్వు  రిషి ఇంటి పైనా అది కూడా  చీకట్లో ఏంటది? నీకు సిగ్గుగా అనిపించడం లేదా?’ అని కోపంగా దేవయాని అడుగుతుంది. హలో  ‘మేడమ్ మీరు మీ భాషను కొంచం మార్చుకుంటే చాలా బాగుంటుంది. పెద్దవారికి  ఇంతకన్నా ఎక్కువ  చెప్పలేను’ అని వసు కోపంగా అంటుంది.

Exit mobile version