Site icon Prime9

Guppedantha Manasu: అక్టోబర్ 14 ఎపిసోడ్ లో వసుధారకు చీర పెట్టిన జగతి

guppedantha manasu prime9news

guppedantha manasu prime9news

Guppedantha Manasu Today: నేటి గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. రిషి వసులు ఇద్దరు  కలిసి, పైకి వెళ్లి, బొమ్మలకు చీరల సెలెక్ట్ చేయడానికి వెళ్తే, దేవయాని రగిలిపోతూ ఉంటుంది. ఇంకా రాలేదు ఇంకా రావట్లేదు అంటూ పదే పదే పైకి చూస్తూ ఉంటుంది. ఇక రిషి తన రూమ్‌లోకి వెళ్లి వసు ఇచ్చిన రాజు రాణీ బొమ్మలన్ని వసు దగ్గరకు తీసుకొని వస్తాడు. వాటిని చూసి మురిసిపోయిన వసు ‘సార్ మనం ఒక సెల్ఫీ తీసుకుందాం’ అంటూ ఫోన్ తీసి సెల్ఫీ తీస్తుంది. మనం కూడా ఎప్పుడూ ఈ బొమ్మల్లానే కలిసి ఉండాలి మనసులో అనుకుంటుంది.

కాసేపటికి ఓ పట్టు చీర తెచ్చి, జగతీ ముందు నిలబడి, ‘మేడమ్ ఇది మా నాన్నమ్మగారి చీర, ఈ చీర ఇంటికి కోడలిగా రాబోతున్న వసుధారకి సాంప్రదాయబద్దంగా మీ చేతులతో అందించండి’ మేడమ్ అనేసరికి దేవయాని ముఖంలో ఇక  రంగులు మారుతుంటాయి. ‘నాన్నా రిషీ’ అంటూ దేవయాని అడ్డుపడబోతుంటే ‘పెద్దమ్మా ఇవ్వనివ్వండి’ అంటాడు. దాంతో జగతీ, గాజులు, పసుపు కుంకుమ జోడించి వసుకి అత్త స్థానంలో జగతి నిలబడి అందిస్తుంది. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Exit mobile version